Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలయ్య కొత్త చిత్రానికి అల్లు అర్జున్ టైటిల్.. బడా ప్రొడ్యూసర్‌తో బోయపాటి చర్చలు.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు మాత్రమే ప్రత్యేకమైనవిగా గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో ఒకటి. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలే దీనికి ప్రధాన కారణం. ఈ రెండు మూవీలు బాలయ్య కెరీర్‌తో పాటు బోయపాటికి కూడా బాగా ప్లస్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత మరోసారి వీళ్లిద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు. ఇది అనుకున్నప్పటి నుంచే ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే...
గర్జించడానికి సిద్ధంగా ఉన్న బాలయ్య
బాలయ్య ప్రస్తుతం నటించిన చిత్రం ‘రూలర్'. కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ మూవీని సీ కల్యాణ్ నిర్మించాడు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సోనాల్ చౌహాన్, వేదిక నటించగా.. ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక కీలక పాత్రలను పోషించారు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలను పోషించారు. ఈ రెండూ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమా హిట్ అవ్వాల్సిందే
‘రూలర్' తర్వాత బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ఈ సినిమా బోయపాటికి ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఆయన గత చిత్రం ఘోర పరాజయం పాలవడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. అందుకే సినిమా కథ సహా అన్ని విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఆ డైలాగ్‌తోనే సంకేతాలు ఇచ్చేశాడు
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు బాలయ్యపై తొలి షాట్ తీశారు. ఆ సమయంలో ఆయన నోటి వెంట ఓ పవర్ఫుల్ డైలాగ్ వచ్చింది. ‘నువ్వు చెబితే అది మాటే.. అదే నేనంటే శాసనం' అనే ఈ డైలాగ్‌తోనే సినిమా ఎలా ఉంటుందన్న సంకేతాలు ఇచ్చేశాడు ఈ మాస్ డైరెక్టర్. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
వాళ్లందరినీ తీసుకొస్తాడా.?
ఈ సినిమాలో నటించే ఆర్టిస్టుల విషయంలో ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, సీనియర్ నటి రోజా, శ్రీకాంత్ విలన్ పాత్రను పోషిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అలాగే, హీరోయిన్ విషయంలోనూ పలు పేర్లు బయటికొచ్చాయి. వీటితో పాటు జబర్ధస్త్ వాళ్లు కూడా ఉంటారని అంటున్నారు.
బాలయ్య సినిమాకు అల్లు అర్జున్ టైటిల్
ఈ సినిమా స్క్రిప్టును బట్టి దీనికి ‘ఐకాన్' అనే టైటిల్ అనుకుంటున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో బాలయ్య పాత్ర ప్రజలను చైతన్య పరిచే విధంగా డిజైన్ చేశాడట బోయపాటి శ్రీను. ఇందులో నందమూరి హీరో రైతుగా, పారిశ్రామికవేత్తగా కనిపించబోతున్నాడని, ఈ రెండు పాత్రలు మెసేజ్ ఇచ్చేవిగా ఉంటాయని అంటున్నారు. అందుకే ఈ టైటిల్ అనుకుంటున్నారని టాక్.
బడా ప్రొడ్యూసర్‌తో బోయపాటి చర్చలు
‘ఐకాన్' అనేది అల్లు అర్జున్ టైటిల్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ రూపొందిస్తాడని ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఎందుకనే ఇది పట్టాలెక్కలేదు. దీంతో ఈ టైటిల్ తమకు కేటాయించాలని బోయపాటి.. దిల్ రాజుతో చర్చలు జరుపుతున్నాడని ఫిలిం నగర్ ఏరియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.