హిందీ పుష్ప రిలీజ్ విషయంలో కొత్త టెన్షన్.. రంగంలోకి దిగిన అల్లు అర్జున్.. అంతా సెట్?

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప సినిమా హిందీ థియేట్రికల్ రిలీజ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయం మీద రకరకాల కథనాలు ప్రచారం జరుగుతుండగా తాజాగా అల్లు అర్జున్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ రంగంలోకి దిగడంతో ఈ ఇష్యూ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పుష్ప హిందీ రిలీజ్ కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోయే విధంగా కనిపిస్తుంది. అసలు వివరాల్లోకి వెళితే.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా పుష్ప.. శేషాచలం అడవుల్లో ఉండే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.. తన కెరీర్ లో మొట్టమొదటి సారిగా ఒక డిగ్లామర్ లుక్లో కనిపించబోతున్న అల్లు అర్జున్ సినిమా మీద అంతకంతకు అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

స్టార్ కాస్టింగ్ తో

స్టార్ కాస్టింగ్ తో

కేవలం హీరో హీరోయిన్ లే కాక ఇతర నటీనటులను కూడా మంచి స్టార్ నటీనటులను రోప్ చేయడంతో సుకుమార్ కూడా ఈ సినిమా మీద ఆసక్తి పెరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ లాంటి టాలెంటెడ్ నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. నిజానికి ముందుగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచన లేదు.. కానీ ఈ సినిమా నిడివి అంతకంతకూ పెరుగుతూ పోతుంటే ఏం చేయాలో అర్థం కాక దీనిని రెండు భాగాలుగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు..

ముందే అమ్మేయడంతో

ముందే అమ్మేయడంతో

అందులో భాగంగా పుష్పాది రైజ్ పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్ 17వ తేదీన విడుదల చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్లో మొట్టమొదటిసారి ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే హిందీలో థియేట్రికల్ రిలీజ్ విషయం మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందీలో థియేట్రికల్ రిలీజ్ చేయడానికి హిందీ డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకోవడం లేదని దీంతో పుష్ప హిందీ థియేట్రికల్ రిలీజ్ ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది.

 నేనొప్పుకోను

నేనొప్పుకోను

అయితే అసలు విషయం ఏమిటంటే పుష్పా సినిమా కాంబినేషన్ అనుకున్నప్పుడే అంటే అల వైకుంఠ పురం లో సినిమా విడుదల కూడా కాకముందే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ హిందీ డిస్ట్రిబ్యూటర్ కు హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మేసిందట. అయితే పుష్ప సినిమాకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో బాలీవుడ్ పెద్ద తలకాయలు రెండు ఈసినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారట. అయితే ముందు తనకు హక్కులు అమ్మారు కాబట్టి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఇవ్వనని ఈ హక్కులు తన దగ్గర ఉన్నంత వరకు థియేటర్లలో ఎలా రిలీజ్ చేస్తారో చూస్తానని సదరు హిందీ డిస్ట్రిబ్యూటర్ పట్టుబట్టారు

Recommended Video

Rana Daggubati Launches First Single Acha Telugandame From Hero
 రంగంలో అల్లు అర్జున్

రంగంలో అల్లు అర్జున్

వాళ్ళిద్దరి మధ్య లో పడి సినిమాకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అల్లు అర్జున్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ సహా బాలీవుడ్లో థియేటర్ రిలీజ్ చేయాలని భావించిన పెద్దమనుషుతో అల్లు అర్జున్ ఒక సిట్టింగ్ ఏర్పాటు చేశారని అంటున్నారు. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్ కు ఒక మంచి ఫాన్సీ రేటు ఇచ్చి ఆయనను సైలెంట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.. పుష్ప సినిమాకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలోనే సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X