ఎన్టీఆర్‌కు అల్లు అర్జున్ సర్‌ప్రైజ్.. ఊహించని పరిణామంతో సంబరపడిపోయిన యంగ్ టైగర్.!

By Manoj

కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్నేహాభావ వాతావరణం కనిపిస్తోంది. గతంతో పోల్చేకుంటే ఇప్పుడు చాలా మంది హీరోలు తమ తమ ఇగోలను పక్కన పెట్టేసి అందరితో కలిసి పోతున్నారు. ఇందులో భాగంగానే మిగిలిన హీరోల సినిమాలను సైతం యంకరేజ్ చేస్తున్నారు. ఇక, ఇప్పుడున్న స్టార్ హీరోలు అయితే ఒక అడుగు ముందుకే వేస్తున్నారు. ఒకరి సినిమా ఫంక్షన్లు మరొకరు హాజరు కావడం.. సినిమాలు బాగుంటే అభినందించడం వంటివి ఫ్యాన్స్ మధ్య కూడా స్నేహాన్ని ఏర్పర్చుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ పరిణామం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్.? వివరాల్లోకి వెళితే...

ఆయన సహకారంతో గట్టిగానే కొట్టిన స్టార్ హీరో

ఆయన సహకారంతో గట్టిగానే కొట్టిన స్టార్ హీరో


‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్‌ల తర్వాత త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ వంద కోట్ల మైలురాయిని దాటేసింది. దీంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిందీ మూవీ. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

ఇద్దరు హీరోలను ఒక్కటి చేసేసిన సినిమా

ఇద్దరు హీరోలను ఒక్కటి చేసేసిన సినిమా


‘అల.. వైకుంఠపురములో..' విడుదలైన తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయిపోయింది. మూవీ చాలా బాగుందని చెబుతూ అతడు చేసిన ఈ ట్వీట్‌లో అల్లు అర్జున్‌ను బావ అంటూ సంబోధించడం హైలైట్ అయింది. దీంతో ఈ ఇద్దరు హీరోలతో పాటు మెగా, నందమూరి కుటుంబాల ఫ్యాన్స్ మధ్య బంధం బలోపేతం అయిపోయింది.

అల్లు అర్జున్ ఓ అడుగు ముందుకేశాడు

అల్లు అర్జున్ ఓ అడుగు ముందుకేశాడు

ఇక, ఈ సినిమా సక్సెస్‌ మీట్ సమయంలో అల్లు అర్జున్‌ను కొందరు మీడియా ప్రతినిధులు ఎన్టీఆర్ గురించి స్పందించమని కోరారు. దీనికి బన్నీ ‘మా తారక్ బావకు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మీ అందరి ముందు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, త్వరలోనే అతడిని కలుస్తానని కూడా వెల్లడించాడు.

ఎన్టీఆర్‌కు అల్లు అర్జున్ సర్‌ప్రైజ్

ఎన్టీఆర్‌కు అల్లు అర్జున్ సర్‌ప్రైజ్

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్‌కు అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ ఇచ్చాడట. అవును.. ఇటీవల బన్నీ తన సినిమా సక్సెస్ పార్టీకి ఎన్టీఆర్ సహా ఇండస్ట్రీ వాళ్లను పిలుస్తానని చెప్పాడు. ఇందులో భాగంగానే త్రివిక్రమ్‌తో కలిసి నేరుగా తారక్ ఇంటికి వెళ్లి స్టైలిష్ స్టార్ సర్‌ప్రైజ్ ఇచ్చాడని సమాచారం. ఈ క్రమంలోనే తన పార్టీకి రావాలని అతడని ఆహ్వానించినట్లు తెలిసింది.

బన్నీ చేసిన పనికి యంగ్ టైగర్ ఖుషీ.!

బన్నీ చేసిన పనికి యంగ్ టైగర్ ఖుషీ.!


అల్లు అర్జున్ తన ఇంటికి రావడం.. తనను పార్టీకి ఆహ్వానించడంతో జూనియర్ ఎన్టీఆర్ సంబరపడిపోయాడని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, బన్నీని.. అతడితో పాటు ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను అతడు సన్మానించాడనే టాక్ వినిపిస్తోంది. అలాగే, పార్టీకి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చాడని అంటున్నారు. దీంతో ఆ రోజుపై అందరిలో ఆసక్తి నెలకొంది.

వీళ్లిద్దరూ ఆ ఇద్దరకీ బుక్ అయిపోయారు

వీళ్లిద్దరూ ఆ ఇద్దరకీ బుక్ అయిపోయారు


ప్రస్తుతం అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో..' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. దీని తర్వాత అతడు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇందులో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడని అంటున్నారు. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్... రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR'లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో అతడు కొమరం భీంగా కనిపించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X