పుష్ప 2 కోసం రిస్క్ చేస్తున్న అల్లు అర్జున్.. ఆ సెంటిమెంట్ ను నమ్మే ఇదంతా?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుంది అనేది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. పూర్తిగా కరోనా తొలగిపోని రోజుల్లో కూడా సౌత్, నార్త్ రాష్ట్రాల్లో కూడా సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. అయితే ప్రస్తుతం పుష్ప సినిమా చూసిన అందరూ కూడా రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో బన్నీ ఒక రిస్కీ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అద్భుతమైన విజయం

అద్భుతమైన విజయం


అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా మొదటి భాగం డిసెంబర్ నెలలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ఫహాద్ ఫాజిల్, సునీల్ అనసూయ వంటి వారు నెగటివ్ షేడ్స్ లో కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్ మొత్తం శెట్టి మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఉత్తరాదిలో కూడా

ఉత్తరాదిలో కూడా


ఈ సినిమా కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా సత్తా చాటింది. ఈ సినిమాతో తెలుగు మాస్ సినిమా దెబ్బ ఏమిటో మరోసారి ఉత్తరాదికి తెలిసి వచ్చినట్లయింది. అయితే ఈ సినిమా మొదట అనుకున్నప్పుడు కేవలం ఒక భాగంగానే చేయాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత నిడివి అంతకంతకూ పెరుగుతూ వెళ్లడంతో రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకున్నారు.

మెచ్చే విధంగా

మెచ్చే విధంగా


అందులో భాగంగానే మొదటి భాగానికి పుష్ప ది రైజ్ అని రెండో భాగానికి పుష్ప ది రూల్ అని టైటిల్స్ పెట్టుకున్నారు. అయితే పుష్ప మొదటి భాగం డిసెంబర్ నెల 2021వ సంవత్సరంలో విడుదల కాగా రెండో భాగాన్ని 2022వ సంవత్సరంలో విడుదల చేయాలని తొలుత భావించారు.. అయితే కేజిఎఫ్ సినిమా నార్త్ లో అద్భుతమైన వసూళ్లు సాధిస్తున్న క్రమంలో పుష్ప రెండో భాగానికి కూడా భారీగా బడ్జెట్ వెచ్చించి, నార్త్ ఆడియన్స్ మరింత మెచ్చే విధంగా తయారు చేయాలని భావిస్తున్నారు.

ఇబ్బందికరంగా మారే అవకాశం

ఇబ్బందికరంగా మారే అవకాశం


ఈ క్రమంలో త్వరగా షూటింగ్ పూర్తి చేయకుండా చాలా ఆచితూచి అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసేలాగా ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. అయితే దాదాపుగా దక్షిణాది నుంచి వస్తున్న సినిమాల సీక్వెల్స్ విషయంలో ఉత్తరాది అభిమానులు ఎగ్జైట్ మెంట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది కూడా. అయితే ఆ సెంటిమెంట్ పుష్ప విషయంలో మాత్రం కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది

 ఆసక్తి రేకెత్తించకుండా

ఆసక్తి రేకెత్తించకుండా


ఎందుకంటే బాహుబలి అలాగే కేజిఎఫ్ సినిమాల విషయంలో రెండో భాగం మీద ఆసక్తి కలిగించే విధంగా మేకర్స్ మొదటి భాగాన్ని ముగించారు.. కానీ పుష్పాలో రెండో భాగం మీద ఆసక్తి కలిగించేంత క్లైమాక్స్ లో ఏమీ పెద్దగా ట్విస్టులు, ఆసక్తి రేకెత్తించే విషయాలను చూపించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పుష్ప 2కి భారీ బడ్జెట్ పెడుతూ రిస్క్ చేస్తున్నాడు అనే వాదన వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X