twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ కూడా భారీ ప్లాన్ వేశాడు.... సొంతగా ఎదిగేందుకేనా?

    By Bojja Kumar
    |

    Recommended Video

    బన్నీ బాగానే ప్లాన్ వేశాడు..!

    దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఇపుడు ఇదే సూత్రాన్ని టాలీవుడ్ టాప్ స్టార్లు ఫాలో అవుతున్నారు. హీరోగా బాగా సంపాదిస్తున్న సమయంలోనే సొంతగా వ్యాపారాలు, ఫిల్మ్ ప్రొడక్షన్స్ లాంటివి మొదలు పెడుతున్నారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఫైనాన్షియల్‌గా ఎలాంటి ఇబ్బందులు లేక పోవడంతో పాటు.... రాబోయే కాలంలో సినిమా వ్యాపారంలో తమ ఆధిపథ్యం తగ్గకుండా ప్లాన్ చేసుకుంటున్నారు.

    పవన్ కళ్యాణ్ ఇప్పటికే

    పవన్ కళ్యాణ్ ఇప్పటికే

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరో. హీరోగా కోట్లలో రెమ్యూనరేషన్ అందుకునే ఆయన రాజకీయాల వైపు వెళుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నటించే సినిమాల సంఖ్య తగ్గుతుందని టాక్. అందుకే నటుడిగా ఉన్నపుడే సొంతగా ‘పికె క్రియేటివ్ వర్క్స్' అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆల్రెడీ ఈ సంస్థపై సినిమా నిర్మాణం కూడా సాగుతోంది. రేపు ఆయన నటుడిగా సినిమాలు తగ్గించినా... నిర్మాతగా కంటిన్యూ అవ్వడానికే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

     మహేష్ బాబు కూడా

    మహేష్ బాబు కూడా

    మరో టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు కూడా ‘మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి' పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. ఈ బేనర్లో శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం లాంటి చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే.

    దూసుకెలుతున్న రామ్ చరణ్

    దూసుకెలుతున్న రామ్ చరణ్

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సొంతంగా ‘కొణిదెల ప్రొడక్షన్స్' స్థాపించి తొలిసి సినిమాగా ‘ఖైదీ నెం. 150' చిత్రం నిర్మించి భారీ విజయం అందుకున్నారు. ఇపుడు రెండో ప్రాజెక్టుగా రూ. 100 కోట్ల పైగా ఖర్చు పెట్టి ‘సైరా నరసింహారెడ్డి' సినిమా నిర్మిస్తున్నారు.

    సొంత నిర్మాణ సంస్థ దిశగా బన్నీ

    సొంత నిర్మాణ సంస్థ దిశగా బన్నీ

    టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన బన్నీకూడా సొంతగా నిర్మాణ సంస్థ నెలకొల్పేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇందుకు సంబంధించి ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని, త్వరలోనే ఈ ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    బన్నీ నిర్మించే సినిమా

    బన్నీ నిర్మించే సినిమా

    బన్నీ తన సొంత బేనర్లో నిర్మించే సినిమా కూడా ఆల్రెడీ ఖరారైందని, ఈ సినిమాతో పాటు ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నరని సమాచారం. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని, 2018 ఏప్రిల్ లో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉందని టాక్.

    షూటింగులో బన్నీ బిజీ బిజీ

    షూటింగులో బన్నీ బిజీ బిజీ

    ప్రస్తుతం అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. వక్కతం వంశీ ఈ చిత్రానికి దర్శకుడు.

    English summary
    Stylish star Allu Arjun is planning to launch his own production house. The actor who is currently busy with his upcoming movie 'Naa Peru Surya Naa Illu India' which is slated to get released in April/May recently listened to the script by Anu K Reddy and liked it so much that he wants to produce the film on his own.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X