చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకోవటం అంటే ఇదే 'బన్నీ'బాబు..!
అంత అద్భుతంగా తయారైన '100% లవ్" విజయం చూసిన తర్వాత బన్నీకి నిజంగా బాథే కలిగింది. ఒక కళాకారుడికుండే మనోవేదన అది. చిత్రం గీతా ఆర్ట్స్ దే. చిత్ర విజయం తనకే లాభం కానీ, ఆ సినిమాలో పాత్రని తాను పోషిస్తే బావుండేదే అన్న వేదన బన్నీది కాదు, ఆయన లోపల దాగి ఉన్న కాళాకారుడిది. దర్శకుడు సుకుమార్ తనకా కథ చెప్పినప్పుడు ఒక యాక్షన్ చిత్రం చెయ్యాలనే కోరిక ఉండటం వలన '100% లవ్"లో చెయ్యటానికి ఒప్పుకోకపోవటం బన్నీకి ఇప్పుడు బాధ కలిగిస్తోంది.
అయితే, ఆ బాధ 'బద్రినాథ్" టాక్ వల్ల కాదు, బద్రినాథ్ ని సినీ ప్రేమికులంతా 'మగధీర" తో పోల్చి చూసారు. అందుకే దానంత జనాదరణ పొందలేకపోయింది అంటారు బన్నీ. అలాగే, 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" చిత్రం విషయంలో కూడా ప్రభాస్ కాకుండా, ఆ పాత్రను తను పోషిస్తే ఇంకా బాగా వచ్చుండేది అంటారు బన్నీ. అసలు మిస్టర్ ఫర్ ఫెక్ట్ అనేది ఆర్య-2లోంచి వచ్చిన ప్రేరణే కదా..! ప్రభాస్ మరో చిత్రం 'బిల్లా" లో కూడా 'అరుంధతి" లోంచి తీసుకున్న 'బొమ్మాళీ"ని నిన్నొదలా వదలా వదలా బొమ్మాళీ" అంటూ పాటో ఉపయోగించారు. చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకోవటం అంటే ఇదే కదా..


Click it and Unblock the Notifications











