సైరాలో అల్లు అర్జున్.. మెగాస్టార్ ఆసక్తి మేరకే.. పాత్ర ఏంటంటే..!

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నర్సింహారెడ్డి. ఈ చిత్రం షూటింగ్ దశలోనే పలు సంచలన విషయాలకు వేదికగా మారుతున్నది. ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్నది. పలు భాషలకు సంబంధించిన నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్, కన్నడ హీరో సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి లాంటి వాళ్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా అల్లు అర్జున్ పేరు కూడా ఈ జాబితాలో చేరింది. వివరాల్లోకి వెళితే..

ముఖ్య పాత్రలో అల్లు అర్జున్

ముఖ్య పాత్రలో అల్లు అర్జున్

సైరా చిత్రంలోని ఓ కీలక పాత్రలో అల్లు అర్జున్ నటించనున్నారనే విషయం మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో రుద్రమదేవి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రంలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా ఫ్యామిలీ కోరిక మేరకు అల్లు అర్జున్ సైరాలో కనిపించబోతున్నాడట.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాత్ర గురించి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాత్ర గురించి

సైరాలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. అయితే ఆ సినిమాలోని పాత్రకు సంబంధించిన షూట్ ఇంకా చేయలేదని, కొద్ది రోజుల్లో అల్లు అర్జున్ సైరా షూటింగ్‌లో పాల్గొంటారు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

గెడ్డం లుక్ అందుకేనా?

గెడ్డం లుక్ అందుకేనా?

ఇటీవల కాలంలో అల్లు అర్జున్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. గెడ్డం పెంచి రఫ్‌గా కనిపించడం సైరా కోసమే అని ప్రచారం జరుగుతున్నది. అల్లు అర్జున్ ఏ పాత్రలో నటిస్తున్నాడు అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. అల్లు అర్జున్‌ను సైరాలో నటింపజేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆసక్తి చూపారనేది వార్త సారాంశం.

 మార్చిలో షూటింగ్‌కు..

మార్చిలో షూటింగ్‌కు..

సైరా షెడ్యూల్ ప్రకారం అంతా అనుకున్నట్టు జరిగితే మార్చి నెలలో అల్లు అర్జున్ షూటింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సమాచారం. ఒకవేళ డేట్స్ సమస్య గానీ, ఇతర కారణాలు అవాంతరాలు తలెత్తితే మరో నటుడిని ఎంపిక చేసే అవకాశం లేకపోలేదని వినిపిస్తున్నది. సైరాలో అవకాశం వస్తే అల్లు అర్జున్ వదులుకోవడం జరుగదని మరో వాదన కూడా వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X