Allu Arjun- NTR: అల్లు అర్జున్ - ఎన్టీఆర్ మల్టీస్టారర్? ఆ స్టార్ డైరెక్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Allu Arjun- NTR: టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒక్క హీరోను వెండితెరపై చూడడమే అభిమానులకు పండగగా భావిస్తారు. అలాంటిది.. ఇద్దరు లేదా ముగ్గురు స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. అలాంటి మల్టీస్టారర్‌లలో ఆర్ఆర్ఆర్( RRR) ఒక చరిత్రను సృష్టించింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది. ఆ స్థాయి తర్వాత మరో మల్టీస్టారర్ వస్తుందా? అన్న ప్రశ్నకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆ క్రమంలో అల్లు అర్జున్ - జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ అంటూ ఓ బజ్ క్రియేట్ అయింది. ఇంతకీ ఆ కథేంటీ?
ఆర్ఆర్ఆర్ తర్వాత మరో భారీ కాంబో?
ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలసి నటించగా... ఈసారి అల్లు అర్జున్ - ఎన్టీఆర్ కలిసి ఓ భారీ మల్టీస్టారర్‌కు సిద్ధమవుతున్నారనే ఓ రూమర్స్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్న విషయం ఏమిటంటే... దీనికి దర్శకుడిగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు వినిపించడమే. విక్రమ్, ఖైదీ, మాస్టర్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్... తన సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో ప్రత్యేక బ్రాండ్‌గా మారిపోయాడు. అయితే ఇటీవల వచ్చిన కూలీ సినిమా భారీ అంచనాల మధ్య డిజాస్టర్ కావడంతో లోకేష్ తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. అయినా కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడని సమాచారం.

ఈ క్రమంలోనే లోకేష్ ఓ భారీ మల్టీస్టారర్ కథను సిద్ధం చేసుకున్నాడట. ఆ కథ కోసం ఇద్దరు టాప్ స్టార్స్ కావాలని భావించి, ముందుగా ఈ కథను అల్లు అర్జున్‌కు వినిపించాడని టాక్. కథ నచ్చడంతో బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా ఒక పాత్రను అల్లు అర్జున్ చేయగా.. మరో కీలక పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ అయితే పర్ఫెక్ట్ అని లోకేష్ భావిస్తున్నాడట. ఈ విషయాన్ని బన్నీతో కూడా చర్చించగా.. 'ఎన్టీఆర్ ఉంటేనే ఈ సినిమా చేస్తా' అని అల్లు అర్జున్ చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు లోకేష్ పూర్తి ఫోకస్ ఎన్టీఆర్ మీదే పెట్టాడని అంటున్నారు. అయితే ఇప్పటివరకు లోకేష్ ఎన్టీఆర్‌కు కథ వినిపించలేదట. త్వరలోనే తారక్‌కు నేరుగా కథ చెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం.
అంతా బాగానే ఉన్న ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడం సాధ్యమవుతుందా? అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే.. వీరిద్దరూ బిజీ షెడ్యూల్సే. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దేవర 2, త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్ట్స్ లను వరుసగా లైన్ లో పెట్టారు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. పుష్ప 2తో ఇండియన్ సినీ పరిశ్రమలోనే కొత్త రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్‌తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా కూడా లైన్లో ఉంది. ఈ పరిస్థితుల్లో లోకేష్ మల్టీస్టారర్ మొదలయ్యే సరికి కనీసం రెండు నుంచి మూడేండ్లు పట్టే అవకాశముందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే.. ఇంతకీ ఈ మూవీ వర్కవుట్ అవుతుందా? ఈ సినిమా తెరకెక్కుతుందా? అనే ట్రోల్స్ మొదలయ్యాయి.
ఇది నిజమైతే రచ్చే!
అల్లు అర్జున్ - జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ మంచి స్నేహితులు. 'బావా బావా' అంటూ పిలుచుకునే ఈ ఇద్దరూ ఇప్పటివరకు ఒకే సినిమాలో కలిసి నటించలేదు. ఇప్పుడు అదే జరిగితే... అది కచ్చితంగా పాన్ ఇండియా లెవల్‌లో సంచలనం అవుతుందన్నది అభిమానుల అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇది కేవలం టాక్ మాత్రమే. అధికారిక ప్రకటన లేదు. అయినా కూడా ఈ వార్త బన్నీ, తారక్ అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. లోకేష్ కనగరాజ్ ప్లాన్ నిజంగా వర్కవుట్ అవుతుందా? అల్లు అర్జున్ - ఎన్టీఆర్ మల్టీస్టారర్ నిజమవుతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ... ఒకవేళ ఇది నిజమైతే మాత్రం టాలీవుడ్‌లో మరో చరిత్ర రాయడం ఖాయం.


Click it and Unblock the Notifications











