రామ్ చరణ్ అడుగుల్ని పసిగడుతున్న అల్లు అర్జున్
'మగధీర" చిత్రం రామ్ చరణ్ తో నిర్మించినందుకు అల్లు అరవింద్ పై వారబ్బాయి అల్లు అర్జున్ అలిగాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. తన కొడుకు బాధ తట్టుకోలేక అదే తరహా చిత్రం అందివ్వాలని చేసిన 'బద్రినాథ్" అల్లుకి బిగ్ షాకే ఇచ్చింది. రామ్ చరణ్ 'ఆరెంజ్" ప్లాప్ కావడంతో ఇద్దరం ఒకే స్థాయిలో ఉన్నామని బన్నీ కూడా 'బద్రినాథ్" ను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికే మెగా ఇమేజ్ తో తనకు పోటీగా ఉన్న రామ్ చరణ్ వేస్తున్న ప్రతి అడుగును బన్నీ పసిగడుతున్నాడట.
ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న 'రచ్చ" చిత్రం గురించి బన్నీ తెగ ఆరాలు తీస్తున్నాడని అతని సన్నిహితులు తెలుపుతున్నారు. శ్రీలంకలో జరుగుతున్న 'రచ్చ" షూటింగ్ స్పాట్ కి సైతం బన్నీ వెళ్లిరావడం, ఇంకా సంపత్ నంది టాలెంట్ గురించి పదేపదే ఆరాలు తీయండం వంటివి చూస్తుంటే పై అనుమానం నిజమేననిపిస్తుంది. చరణ్ తనకు ఎంతవరకు పోటీ అనుకుంటున్నాడో తెలియదుగానీ బన్నీ మాత్రం ఇలా రచ్చ" చేసుకుంటూ తనని తానూ కించ పరుచుకుంటున్నాడు...!


Click it and Unblock the Notifications











