రూమర్స్ ని తిప్పికొట్టేందుకే అల్లు అర్జున్ ఆ నిర్ణయం తీసుకున్నాడు
అల్లు అర్జున్ అతని భార్య స్నేహా రెడ్డి తో కలిసి ఓ కమర్షియల్ యాడ్ లో కనిపించబోతున్నాడంటూ ఇటీవల మీడియాలో హంగామా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అల్లు అర్జన్ వెబ్ మీడియా వారికి పర్శనల్ లెటర్స్ కూడా పంపిచాడు. తనపై వచ్చే రూమర్స్ ని తన మేనేజర్స్ అడిగి క్లారిఫై చేసుకుని ప్రచురించమని, తన పర్శనల్ లైఫ్ కి భంగం కలిగించవద్దని. అయితే అల్లు అర్జున్ క్రేజీ ఉన్న స్టార్ కావటంతో అతని న్యూస్ వెంటనే పబ్లిష్ చేయటమే కానీ, క్లారిఫై చేసుకునేందుకు టైమ్ ఉండటం లేదని వారు వివరించారు. దానితో అల్లు అర్జున్ ఓ నిర్ణయం తీసుకున్నారు. అది స్వంతంగా ఓ వెబ్ సైట్ పెట్టాలని. అల్లు అర్జున్ ఆన్ లైన్ పేరుతో తాను ఓ వెబ్ సైట్ పెట్టుకుంటే అందులో తన గురించిన పూర్తి న్యూస్ లు ఉంటాయని, అప్పుడు అది చూసుకుని కన్ఫర్మ్ చేసుకోవచ్చని సూచించారు. అలాగే తనకు వెబ్ సైట్ ఉంటే ఏ న్యూస్ బయిటకు వెళ్ళాలో ఏది అక్కర్లేదో అన్న క్లారిటీతో వ్యవరించవచ్చని భావిస్తున్నాట్ట. అతని అభిమానులు కూడా అల్లు అర్జున్ కి ప్రత్యేకంగా వెబ్ సైట్ ఉంటే బెస్ట్ అని ఎప్పటినుంచో సూచిస్తున్నారుట. ఇక అల్లు అర్జన్ తాజా చిత్రం బద్రీనాధ్ ఈ నెల పదవ తేదీన విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











