ఆన్‌లైన్‌లో ఆ వీడియోలతో అల్లు అర్జున్ బిజీ.. స్టార్ డైరెక్టర్ సలహాతోనే ఈ నిర్ణయం.!
అల్లు అర్జున్.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఒకడు. 'గంగోత్రి' సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. తక్కువ సమయంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరో అయిపోయాడు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌తో పాటు సినిమా సినిమాకూ సరికొత్త స్టైల్‌ను పరిచయం చేస్తూ యూత్‌తో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. సినిమా కోసం సాహసాలకూ వెనుకాడని బన్నీ.. ఓ దర్శకుడి సలహాతో కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఆ సంగతులేంటో చూద్దాం.!

లేట్ అయినా లేటెస్ట్‌గా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు
‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' తర్వాత అల్లు అర్జున్ చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల.. వైకుంఠపురములో' అనే మూవీ చేశాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు అత్యధిక కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

మొదటి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్‌తో కలిసిన బన్నీ
కెరీర్ ఆరంభంలోనే ‘ఆర్య'తో అల్లు అర్జున్‌ను సరికొత్తగా చూపించి స్టైలిష్ స్టార్ అయ్యేలా చేశాడు సుకుమార్. ఇప్పుడు ఆయనతోనే బన్నీ మూడోసారి జత కట్టాడు. వీళ్లిద్దరి కలయికలో రాబోతున్న ఈ మూవీకి ‘పుష్ప' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మొత్తం ఐదు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది.

అల్లు అర్జున్ లేకున్నా.. కంప్లీట్ చేసిన సుక్కూ
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాలతో ఆలస్యం అయింది. ‘అల.. వైకుంఠపురములో' విడుదల తర్వాత పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ బన్నీ లేకుండానే ప్రారంభం అయిపోయింది. కేరళలో జరిగిన మొదటి షెడ్యూల్‌లో అల్లు అర్జున్ లేని సన్నివేశాలను చిత్రీకరించారని ప్రచారం జరుగుతోంది.

ఒకే ఒక్క అప్‌డేట్‌తో రికార్డులు క్రియేట్ చేశారు
ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇటీవలే రివీల్ చేసింది. మొదటి నుంచీ అనుకుంటున్నట్లు గానే ఈ మూవీ గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రాబోతుంది. ఈ విషయం ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపించారు. అయితే, ఇది పాన్ ఇండియా మూవీ అని ఎవరూ ఊహించలేదు. మరోవైపు, ‘పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో చాలా రికార్డులు బద్దలైపోయాయి.

ఆన్‌లైన్‌లో ఆ వీడియోలతో అల్లు అర్జున్ బిజీ
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్.. గంథపు చెక్కలు స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇందులో అతడు చిత్తూరు యాస మాట్లాడతాడని అంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ న్యూస్ లీక్ అయింది. ప్రస్తుతం ఖాళీగా ఉంటోన్న బన్నీ ఆన్‌లైన్‌లో ఆ యాసకు సంబంధించిన వీడియోలు చూస్తున్నాడని టాక్.
Recommended Video

స్టార్ డైరెక్టర్ సలహాతోనే బన్నీ ఈ నిర్ణయం.!
బన్నీకి క్లోజ్ ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన సలహా మేరకే.. అతడు లాక్‌డౌన్ పిరియడ్‌లో చిత్తూరు యాస నేర్చుకుంటున్నాడని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో ఆయన తెరకెక్కించిన ‘అరవింద సమేత'లో సైతం ఎన్టీఆర్‌తో అదే యాసను పలికించాడు గురూజీ. ఇప్పుడు ఆ అనుభవంతోనే అల్లు అర్జున్‌కు సైతం సలహా ఇచ్చాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











