హాట్ టాపిక్: అల్లు అర్జున్ లిప్ లాక్

By Srikanya

మొత్తానికి అల్లు అర్జున్ కూడా లిప్ లాక్ కిస్ ల జాబితాలో చేరిపోయాడు. ఆతని తాజా చిత్రంలో ఇలియానాకి లిప్ లాక్ కిస్ ప్రసాదిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంలో ఈ కిస్ సీన్ సినిమాలో ఓ హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. వీటికి సంభందించిన సీన్స్ రీసెంట్ గానే చిత్రీకరించారని సమాచారం. గతంలోనూ ఆర్య 2, వరుడు,వేదం చిత్రాల్లో లిప్ లాక్ కిస్ లు ఉన్నా ఇప్పుడున్నంత హాట్ గా ఉండవని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో సోనూసూద్ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారు. పూర్తిగా కామెడీతో చెప్పబడ్డ ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పోలీస్ గా కనిపించి నవ్వించనున్నారు.

అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత డివివి దానయ్య ప్లాన్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్‌ తాజాగా మరో పెద్ద చిత్రాన్ని ఒప్పుకున్నారు. యాక్షన్‌ చిత్రాల నిర్మాణంలో తనదైన శైలిగల దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాత. త్రివిక్రమ్‌ చిత్రం పూర్తయిన వెంటనే అల్లు అర్జున్‌ ఈ కొత్త చిత్రంలో నటిస్తారు. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, టెక్నీషియన్స్‌ వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X