అల్లు అర్జున్-లోకేష్ కనకరాజ్ కాంబో.. హీరోయిన్‌ ఫిక్స్‌.. ఎవరంటే?

టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ కాంబినేషన్ సెట్ అవుతుందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్ట్ 'AA23' (లేదా 'LK7')పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్ అభిమానుల్లో మరింత హైప్ పెరిగింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తుంది. దీంతో ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?

హిట్ కాంబో మళ్లీ రిపీట్?
అల్లు అర్జున్ - పూజా హెగ్డే కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు వెంటనే గుర్తుకొచ్చే సినిమాలు దువ్వాడ జగన్నాధం, అలా వైకుంఠపురంలో.ఈ రెండు సినిమాల్లో ఈ జంట ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ జోడీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు మూడోసారి కూడా ఇదే జంట కలిస్తే అభిమానులు హ్యాట్రిక్ కాంబో అవుతుందని భావిస్తున్నారు.

Allu Arjun Lokesh Kanagaraj AA23 Pooja Hegde Likely Female Lead

లోకేష్ కనగరాజ్ అంటేనే స్టైలిష్ యాక్షన్, ఇంటెన్స్ స్క్రీన్‌ప్లే, కనెక్ట్ అయ్యే యూనివర్స్. ఇప్పటికే ఆయన రూపొందించిన విక్రమ్, లియో వంటి చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ముఖ్యంగా ఆయన క్రియేట్ చేసిన 'లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)' దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఇదే స్టైల్‌ను 'AA23'లో కూడా అవకాశం ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ను పూర్తిగా కొత్త మాస్ అవతార్‌లో చూపించేందుకు లోకేష్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. పవర్ ఫుల్, డార్క్ షేడ్స్ కలిగిన పాత్రలో బన్నీ కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోంది. సంగీతం కోసం మళ్లీ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికే విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉండగా, ప్రీ-ప్రొడక్షన్ వేగంగా కొనసాగుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

పూజా హెగ్డే పాత్ర స్పెషల్?
ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో కీలకంగా ఉండేలా డిజైన్ చేస్తుంది. లోకేష్ సినిమాల్లో హీరోయిన్లకు కూడా ప్రాధాన్యత ఉండటం వల్ల ఈ పాత్రపై ఆసక్తి పెరిగింది. పూజ కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఆసక్తిగా ఉందని టాక్. ఇక పూజ హెగ్డే కూడా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఉంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తూ తన కెరీర్‌ని మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా వరుణ్ ధావన్‌తో చేస్తున్న సినిమా, అలాగే విజయ్‌తో నటిస్తున్న ప్రాజెక్ట్‌లు ఆమెకు మంచి క్రేజ్ తీసుకొస్తున్నాయి.

ఇలా అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఇప్పటికే భారీ హైప్ ఉండగా.. ఇప్పుడు పూజా హెగ్డే ఎంట్రీ వార్తతో ఈ ప్రాజెక్ట్ మరో స్థాయికి వెళ్లింది. ఈ వార్త అధికారికంగా కన్ఫర్మ్ అయితే టాలీవుడ్, కోలీవుడ్‌లో ఒక భారీ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ సిద్ధమైనట్టే అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ అన్నీ ఇండస్ట్రీ టాక్ మాత్రమే. హీరోయిన్ ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం "బన్నీ - పూజ - లోకేష్" కాంబో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అభిమానులు ఈ అనౌన్స్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X