త్రివిక్రమ్ ఆర్డర్: అల్లు అర్జున్ తగ్గక తప్పడం లేదు
హైదరాబాద్: ‘జులాయి' తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నసంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలోని క్యారెక్టర్‌కు తగిన విధంగా 10 కేజీల బరువు తగ్గాలని దర్శకుడు త్రివిక్రమ్ ఆర్డర్ వేసారట. ఇటీవల రుద్రమదేవి షూటింగు కోసం కాస్త బరువు పెరిగిన అల్లు అర్జున్....త్రివిక్రమ్ సూచనల మేరకు బరువు తగ్గించుకునేందుకు జిమ్ లో వర్కౌట్లు చేస్తూ చమటోడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈచిత్రం కోసం త్రివిక్రమ్ తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది. రూ. 12 కోట్ల రెమ్యూరేషన్‌తో పాటు 25 శాతం టేబుల్ ప్రాఫిట్ తీసుకుంటున్నాడట త్రివిక్రమ్. అంటే ఈమొత్తం దాదాపుగా 15 నుండి 18 కోట్లు ఉండొచ్చని అంటున్నారు. అయితే బన్నీ రెమ్యూనరేషన్ రూ. 8 కోట్ల లోపే ఉంటుందని అంచనా.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న తాజా సినిమా విశేషాల్లోకి వెళితే....ఏప్రిల్ 10న ఈచిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. సెప్టెంబర్ 22 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ సినిమాలకు తమిళం, మలయాళంలో మంచి డిమాండ్ ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. ఆ నేటివిటీకి తగిన విధంగా ఆయా బాషలకు చెందిన యాక్టర్లను కూడా సినిమాలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











