ప్చ్... అల్లు అర్జున్ ..నో చెప్పేసాడట

By Srikanya

హైదరాబాద్ : ఒక హిట్ సినిమాతో దర్శకుడు లేదా హీరో ఫేట్ ఓవర్ నైట్ లో మారిపోయినట్లే ఓ ఫ్లాఫ్ సైతం అదే స్ధాయిలో కెరీర్ లను శాసిస్తూంటుంది. తాజాగా అలాంటి పరిణామమే రభస దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ చిత్రం రిలీజ్ కు ముందు ఆయన అల్లు అర్జున్ తో ఓ చిత్రం ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడా చిత్రం దాదాపు లేనట్లే అని తెలుస్తోంది. రభస సేఫ్ వెంచర్ అని చెప్తున్నా...టాక్ తో వచ్చిన ఇంపాక్ట్ మాత్రం ఇలా కనిపిస్తోందంటున్నారు.

ఇంతకు ముందు కూడా రామయ్య వస్తావయ్యాకు ముందు..హరీష్ శంకర్ ..అల్లు అర్జున్ కాంబినేషన్ లో తిక్క రేగితే చిత్రం ప్లాన్ చేసుకున్నారు. అయితే రామయ్యా వస్తావయ్యా డిజాస్టర్ చిత్రం కావటంతో ఆ దర్శకుడుతో వద్దనుకున్నారు అల్లు అర్జున్ అని చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ సంతోష్ శ్రీనివాస్ దీ అదే పరిస్ధితి .

ఇక అల్లు అర్జున్ వైపు నుంచి అతని నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది. ఆయన్ను డైరక్ట్ చేయటానికి చాలా మంది స్టార్ డైరక్టర్స్ క్యూ లో ఉన్నప్పుడు ఆయన రిస్క్ చేయాల్సిన అవసరం ఏముంది. ఎంత స్క్రిప్టు నచ్చినా, హిట్ డైరక్టర్ తో చేస్తే ఆ ప్రాజెక్టుకు వచ్చే క్రేజే వేరు అనేది నిజం.

Allu Arjun loses faith in director Santosh Srinivas

ప్రస్తుతం...

మొదటి నుంచీ అల్లు అర్జున్‌.. ఉత్సాహానికి మారు పేరు. చేసే ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రేమికుడిగా, బాధ్యతలు నెత్తికెత్తుకున్న యువకుడిగా, దేశముదురుగా.. ఇలా వివిధ పాత్రలతో అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇతడు చారిత్రక నేపథ్యమున్న పాత్రలో కనిపించబోతున్నాడు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రంలో అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డి చేయటంతో అతని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్‌ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న హీరో అతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం హీరోలలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు.

ఎన్టీఆర్‌కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్‌కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది. ఇప్పటికే బన్నీ గుర్రపుస్వారీ, కత్తిసాములో శిక్షణ పొందుతున్నాడు. అతడి సరసన అనామిక దేవిగా కేథరిన్‌ నటిస్తుంది'' అంటూ గుణశేఖర్ చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X