అల్లు అర్జున్ పెళ్ళికి రెడీ..అత్తవారి ఊరు...
అల్లు అర్జున్ పుట్టినరోజు పూట తన పెళ్ళి కబుర్లు చెప్తున్నాడు. ఆయన మీడియాకు ఇంటర్వూ ఇస్తూ...తన పెళ్ళి బ్రహ్మచారిగా పుట్టినరోజు జరుపుకోవడం ఇదే ఆఖరవుతుందేమో. ఈ ఏడాది ఎలాగైనా పెళ్లి చేసేయాలని ఇంట్లో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ పూర్తయ్యే సరికి ఎలాగూ వచ్చే జనవరి, ఫిబ్రవరి అవుతుందని నా నమ్మకం అన్నారు.అయితే వివాహం దాదాపు నిశ్చయమైపోయినట్లే నని విశ్వసనీయ సమాచారం. వైజాగ్ కి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్తెతో అల్లు అర్జున్ ని ముడి పెట్టాలని ఇరు కుటుంబాల పెద్దలూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్ళి కూతురు గురించి బన్నీ చెపుతూ...ఇప్పటి వరకూ నేను ఎవరి మీదా మనసు పడలేదు. నేను చేసుకోబోయే అమ్మాయిలో ఫలానా లక్షణాలుండాలని చాలాసార్లు అనుకున్నాను. అవి ఎప్పటికప్పుడు మారుతూ వచ్చాయి. ఇప్పుడు కోరికల జాబితా ఏమీ లేదు. ఎవరైనా ఫర్వాలేదు. సర్దుకుపోవడమే జీవితం అన్నారు. లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతూ...మంచి అమ్మాయి కోసం మా ఇంట్లోవాళ్లు వెతుకుతున్నారు. ఈలోపు నాకు నచ్చిన అమ్మాయి తారసపడి ప్రేమలో పడితే అప్పుడు లవ్ మ్యారేజ్ అవుతుంది. మా ఇంట్లో లవ్ మ్యారేజ్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అన్నారు.


Click it and Unblock the Notifications











