ఐకాన్ స్టార్ టాలీవుడ్ ఎంట్రీ.. బడా డైరెక్టర్ తో బన్నీ సినిమా.. ?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాడు. ఆ అద్భుతమైన నటనకు ఏకంగా జాతీయ అవార్డు వరించింది. ఇక పుష్ప 2 సినిమాతో మరోసారి ఇండియన్ ఫిలిం హిస్టరీ రికార్డ్స్ ను బ్రేక్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించి.. పుష్పగాడి సత్తా ఏంటో నిరూపించాడు. ఈ నేపథ్యంలో అల్లుఅర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇంతకీ ఆ ఆ కథ ఏంటో? మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

అల్లు అర్జున్ పాపులారిటీ మామూలుగా లేదు. పుష్ప సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాడు. కేవలం సౌత్ లోనే కాకుండా .. నార్త్ లో కూడా తన సత్తా ఏంటో మరోసారి చూపించారు. మరోరకంగా చెప్పాలంటే.. బాలీవుడ్ బాక్సాఫీస్ కు అమ్మ మొగుడుగా మారాడు. పుష్ప2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూలు చేయగా.. అందులో నార్త్ నుంచే ఏకంగా 800 కోట్లకు పైగా రాబట్టాడు. ఇప్పటికీ ఇంకా పుష్ప 2 సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇలానే రన్ అవుతే 1900 కోట్లకు చేరువవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Allu Arjun Meets Bollywood Director Sanjay Leela Bhansali For New Movie

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ పుష్పట్టు కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా పలు రికార్డులను బ్రేక్ చేసింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో బాలీవుడ్ మూవీ మేకర్స్ అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేసేందుకు కసరత్తులు ప్రారంభించారట. డైరెక్ట్ గా హిందీలోనే సినిమా తీసేందుకు చర్చలు జరుపుతున్నారట. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తో కూడా బాలీవుడ్ బడా దర్శకులు సినిమా ప్లాన్ చేయాలని ముందుకు వచ్చారు. కానీ, ఆ ప్లాన్స్ ఏవి వర్కౌట్ కానీ బన్నీ క్రేజ్ అలాంటిది కాదు. అంతకుమించి పుష్ప అంటే వైల్డ్ ఫైల్ అనుకున్నారా.. నీ ఇంటర్నేషనల్ అన్నట్లు.. పిచ్చ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

బాలీవుడ్ లో కూడా తనకంటూ స్పెషల్ మార్కెట్ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్, రామ్ చరణ్ ల కంటే అల్లు అర్జున్ కి డిమాండ్ పెరిగిపోయింది నేషనల్ వైడ్ గా ఎదురులేని స్టార్ గా మారారు. ఈ నేపథ్యంలో...అల్లు అర్జున్, బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సంజీవ్ లీల భన్సాలీ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఈ క్రేజీ ప్రాజెక్టు పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అందుకోసమే అల్లు అర్జున్ రీసెంట్గా ముంబాయికి వెళ్ళాడని, సంజీవ్ లీలా భన్సాలీని కలిసాడని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో ఓ భారీ బడ్జెట్ సినిమా రాబోయే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై క్లారిటీ రావాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సింది.

Allu Arjun Meets Bollywood Director Sanjay Leela Bhansali For New Movie

ఇక సంజీవ్ లీల భన్సాలి.. గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరంటే ట్రక్కుమని గుర్తుకు వచ్చే పేరు ఇతడిదే.‌ ప్రస్తుతం భన్సాలి 'లవ్ అండ్ వార్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బన్సాలి మరోసారి అల్లు అర్జున్తో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. వీటన్నిటిపై త్వరలోనే క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X