అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రం టైటిల్ ఖరారు
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి టైటిల్ హనీ అనీ పార్టనర్ అని రకరకాల టైటిల్స్ వినపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ చిత్రానికి జులాయి అనే టైటిల్ ని ఖరారు చేస్తున్నట్లు సమాచారం. రొమాంటిక్ కామెడీగా రూపొందే ఈ చిత్రానికి ఈ టైటిల్ ఫెరఫెక్ట్ గా సూటవుతుందని దర్శక,నిర్మాతలు నమ్ముతున్నట్లుగా వినపడుతోంది. ఇక ఈ చిత్రానికి మొదట ఈ చిత్రానికి హనీ అనే టైటిల్ పాపులర్ అయ్యింది. అయితే ఆ టైటిల్ వేరే చిత్రం కోసం విజయ్ భాస్కర్ రిజిస్టర్ చేసిందని తెలిసిందే. అల్లు అర్జున్ సైతం తమ చిత్రం టైటిల్ హనీ కాదని చెప్పుకొచ్చారు. అయితే అస్సలు ఈ టైటిల్ కీ చిత్రానికి సంభందం లేదని, అస్సలు తాము ఆ టైటిల్ ని కన్సిడర్ చేయలేదని అల్లు అర్జున్ ఖండించారు.
ఇక ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టైరేజేషన్ హైలెట్ గా ఉంటుందని చెప్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ కెమెరామెన్ అమోల్ రాఘోడ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ భాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియానా నటించనుంది. మిగతా ముఖ్యపాత్రల్లో రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తణికెళ్ల భరిణి, ఎమ్ ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, సోనూ సూద్, బ్రహ్మాజి, రావు రమేష్, ప్రగతి, తులసి, హేమ తదితరులు నటించనున్నారు. అలాగే సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించనున్నారు. రవీందర్ ఆర్ట్ దర్శకత్వం,పీటర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











