»   » షాకింగ్: మెగా క్యాంపుకు దూరంగా అల్లు అర్జున్??

షాకింగ్: మెగా క్యాంపుకు దూరంగా అల్లు అర్జున్??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ ఇమేజ్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.... తనదైన టాలెంటుతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అదిరిపోయే డాన్స్, స్టైలిష్ యాటిట్యూడ్, మంచి పెర్ఫార్మెన్స్, వరుస విజయాలు వెరసి స్టైలిష్ స్టార్ గా స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

హీరోగా కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్న అల్లు అర్జున్.....క్రమక్రమంగా మెగా ఫ్యామిలీతో వీలైనంత డిస్టెన్స్ మెయింటేన్ చేస్తున్నాడని అంటున్నారు. మెగా గొడుగు కిందే ఉండిపోకుండా తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడట. మీడియాలో, అభిమానుల్లో ఇపుడు ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ వ్యవహార శైలి అలానే ఉందని అంటున్నా కొందరు సీనియర్ మెగా ఫ్యాన్స్.

Allu Arjun Moving Away From Mega Camp? Worries Mega Fans

ఇటీవల కాలంలో అల్లు అర్జున్ చిరంజీవి బ్లడ్ బ్యాంకును సందర్శించడం, ఇక్కడ జరిగే మెగా అభిమానుల సమావేశాలకు, ఇతర కార్యక్రమాలకు హాజరవ్వడం మానేసాడు. తన అభిమానులతో మీటింగ్స్, ఇతర కార్యక్రమాలకు గీతా ఆర్ట్స్ ఆఫీసునే వేదిక చేసుకుంటున్నాడట. ఒకప్పుడు మెగా అభిమానులే తన మెయిన్ సపోర్టింగ్ సిస్టమ్ గా భావించిన బన్నీ...ఇపుడు వారితో అసలు టచ్ లో ఉండటం లేదట.

ఈ మధ్య అల్లు అర్జున్ పిఆర్ టీం...ఆయన సినిమాలకు సంబంధించిన ఆడియో వేడుకలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన ఏవి(ఆడియో విజువల్స్)లలో చిరంజీవి పేరును కూడా ప్రస్తావించడం లేదని కొందరు మెగా అభిమానులు గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Allu Arjun Moving Away From Mega Camp? Worries Mega Fans

ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ కార్యక్రమమైనా ముందుగా చిరంజీవి, ఆ తర్వాత రామ్ చరణ్ కు, తర్వాతే ఇతర మెగా హీరోలకు ప్రాధాన్యత ఉంటుంది. దీంతో రామ్ చరణ్ కంటే... తాను ఓ మెట్టు పైకి ఉండటానికి ప్రయత్నిస్తున్నాడట అల్లు అర్జున్. అయితే బన్నీ ఫ్యాన్స్ వాదన మాత్రం మరోలా ఉంది. రామ్ చరణ్ ఈ మధ్య సక్సెస్ విషయంలో వెనకపడటంతో వారు ఇన్ సెక్యూర్ ఫీల్ అవుతూ ఇలాంటి వాదన తెరపైకి తెస్తున్నారని అంటున్నారు.

మరి అభిమాన సంఘాలు, ఫిల్మ్ నగర్ సర్కిల్, మీడియాలో జరుగుతున్న ఈ చర్చ అసలు రామ్ చరణ్, అల్లు అర్జున్ వరకు వెళ్లిందా? దీనిపై వారు ఎలా స్పందిస్తారో? వెయిట్ అండ్ సీ....

English summary
Stylish Star Allu Arjun seems to have more reasons to cherish his stay in Tollywood right now. With back to back successes of his films and unanimous applause for his performances, the days are only boosting up his career to climb new ladders.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu