అల్లు అర్జున్ కొత్త సినిమా.. 'సభకు నమస్కారం'?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున కొత్త సినిమాపై ఊహాగానాలు ఆగడం లేదు. నిన్న మొన్నటి వరకు బన్నీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఉహాగానాలు ఎక్కువ కావడంతో స్వయంగా అల్లు అర్జున్ స్పందించాడు. కొత్త చిత్రం గురించి తాను ప్రకటించే వరకు వేచి చూడాలని ఫ్యాన్స్ ని రిక్వస్ట్ చేశాడు.
తాజగా అల్లు అర్జున్ సినిమా గురించి మరో ప్రచారం మొదలైంది. బన్నీ కొత్త చిత్రానికి సభకు నమస్కారం అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆసక్తికరమైన కథ దిల్ రాజు చెవిన పడడంతో ఆయన బన్నీకి వినిపించాడట. బన్నీ కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ నిజామా కాదా తేలాలంటే మాత్రం అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించాలి. ఈ కథకు సరైన దర్శకుడి కోసం దిల్ రాజు వేట మొదలు పెట్టినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. నా పేరు సూర్య చిత్రం నిరాశపరచడంతో ఆలస్యం జరిగినా హిట్ చిత్రంతో ముందుకు రావాలని బన్నీ భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











