Don't Miss!
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫ్లాప్‌లో ఉన్న దర్శకుడిపై బన్నీ స్పెషల్ ఫోకస్.. 13ఏళ్ళ తరువాత మళ్ళీ అతనితో చర్చలు!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎలాంటి కథ ఎంచుకున్నా కూడా వీలైనంత వరకు సరికొత్తగా ఉండాలే ప్లాన్ చేసుకుంటాడు. మొదటి సినిమా నుంచి కూడా బన్నీ తన డిఫరెంట్ స్టైల్ తో ఫాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. ఇక బన్నీ ఒక కథను ఒకే చేశాడంటే కూడా దర్శకులకు కూడా చాలా నమ్మకం ఉంటుంది. ఇక ఇటీవల ప్లాప్ లో ఉన్న దర్శకుడికి కూడా బన్నీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక కథను కూడా విన్నట్లు సమాచారం.
ఆ కథను 8 మంది రిజెక్ట్ చేసినా..
అల్లు అర్జున్ రెండవ సినిమా నుంచి కూడా కథలో మ్యాటర్ ఎంతవరకు ఉందనే విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు అర్ధమవుతుంది. ఆర్య కథను బన్నీ కంటే ముందు 8 మంది హీరోలు విన్నారు. వాళ్ళందరూ రిజెక్ట్ చేసినా కూడా బన్నీ ఒక్కడే దాన్ని బలంగా నమ్మి సుకుమార్ కు ఒక మంచి బూస్ట్ ఇచ్చాడు.
ప్లాప్ లో ఉన్న మరో దర్శకుడితో..
కథలో మ్యాటర్ ఉంటే అల్లు అర్జున్ దర్శకుల కాన్ఫిడెన్స్ ను ఈజీగా అంచనా వేయగలరని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. పైగా తన ఇన్ పుట్స్ కూడా చాలానే ఇస్తుంటాడు. క్యారెక్టర్ ఏదైనా కూడా తన టాలెంట్ ను పూర్తిగా అందులో పెట్టేస్తాడు. ఇక రీసెంట్ గా ప్లాప్ లో ఉన్న మరో దర్శకుడికి కూడా బన్నీ మంచి సపోర్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
పరుగు తరువాత..
ఆ దర్శకుడు మరెవరో కాదు.. బొమ్మరిల్లు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న బొమ్మరిల్లు భాస్కర్. భాస్కర్ రెండవ సినిమా పరుగుతో బన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా అనంతరం భాస్కర్ ఆరెంజ్ సినిమాతో పాటు ఒంగోలు గిత్త కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యాయి.
బన్నీ సపోర్ట్ తోనే..
ఇక ఎవరు అవకశాలు ఇవ్వని సమయంలో అల్లు అర్జున్ ద్వారా గీత ఆర్ట్స్ సపోర్ట్ చేసింది. GA2 ప్రొడక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అవకాశం రావడానికి ప్రధాన కారణం బన్నీ అనే తెలుస్తోంది. ఇక అఖిల్ కథానాయకుడిగా నటించిన ఆ సినిమా జూలై 19న విడుదల కానుంది. ఆ సినిమా బన్నీ కూడా చూసినట్లు తెలుస్తోంది.
రొమాంటిక్ లవ్ స్టోరీగా..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మేకింగ్ తో భాస్కర్, బన్నీ మనసును టచ్ చేశాడట. ఇక మంచి కథ ఉంటే చెప్పమని అడగడంతో భాస్కర్ అప్పటికప్పుడే ఒక లైన్ కూడా చెప్పాడని టాక్. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఉండే ఆ స్టోరీ మెయిన్ లైన్ బన్నీకి కూడా తెగ నచ్చేసినట్లు టాక్. పుష్ప, కొరటాల శివ ప్రాజెక్టుల అనంతరం భాస్కర్ సినిమాను సెట్స్ పైకి తేవచ్చని టాక్.