Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్‌కు జోడీగా...సమంత ఎంపిక
హైదరాబాద్ : తొలిసారిగా అల్లు అర్జున్, సమంత కాంబినేషన్ తెరపైకి రానుంది. అనారోగ్యం కారణంగా గత కొన్ని నెలలుగా వస్తున్నఆఫర్స్ ని వదులుకున్న సమంతా ప్రస్తుతం మళ్లీ కొత్త సినిమాలపై దృష్టిపెడుతోంది. ఇటీవల అక్కినేని వారసుల త్రయం నటించనున్న సినిమాలో నాగచైతన్య సరసన నటించడానికి అంగీకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో పాటు మరో చిత్రాన్ని కూడా తన ఖాతాలో వేసుకుందని తెలిసింది. అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాష్కర్ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి రానుంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం దర్శకుడు భాస్కర్ ఇటీవలే సమంతాకు చిత్ర కథను వినిపించాడని, సమంతా కూడా ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది. అల్లు అర్జున్, బొమ్మరిల్లు భాస్కర్ల కాంబినేషన్లో గతంలో 'పరుగు' చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. భాస్కర్ ప్రస్తుతం రామ్ తో ఒంగోలు గిత్త టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు.
పస్తుత హీరోయిన్స్ అందరిలోకెల్లా బాగా బిజీ ఎవరంటే సమంత పేరు ప్రథమంగా చెప్పాల్సిందే. అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ ఎక్కువ సినిమాలు చేస్తున్నారామె. ఇక కాల్షీట్లు కేటాయించలేక మణిరత్నం లాంటి ప్రముఖ దర్శకుల సినిమాలు కూడా సమంత వదిలేసుకోవాల్సి వచ్చింది.
మహేశ్‌బాబుతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రామ్‌చరణ్‌తో 'ఎవడు', నానితో 'ఎటో వెళ్లిపోయింది మనసు', నాగచైతన్యతో 'ఆటోనగర్ సూర్య', సిద్దార్థ్‌తో నందినీరెడ్డి సినిమా చేస్తున్న సమంత త్వరలో అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. అల్లు అర్జున్-సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించనున్న చిత్రంలో సమంత హీరోయిన్ గా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇక అల్లు అర్జున్‌తో సమంత నటించడం ఇదే తొలిసారి. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఓ పవర్ఫుల్ టైటిల్‌ని దర్శక నిర్మాతలు ఇప్పటికే ఫిక్స్ చేసారని సమాచారం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్లో 'ఇష్క్' ఫ్రేమ్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో 2013లో మొదలుకానున్న 'త్రయం'లో కూడా సమంత హీరోయిన్ గా ఎంపికయ్యారు. దీంతోపాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆమె కోసం సిద్ధంగా ఉండడం విశేషం.