Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సీనియర్ రొమాంటిక్ దర్శకుడితో అల్లు అర్జున్ న్యూ మూవీ.. డైరెక్ట్ తమిళ్లోనే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్పపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అల.. వైకుంఠపురములో సినిమాతో అలా హిట్టు అందుకోగానే వెంటనే స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న కొత్త కథను సుకుమార్ తో స్టార్ట్ చేశాడు. పుష్ప సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇక ఆ సినిమా తరువాత బన్నీ చేయబోయే ప్రాజెక్టులు అంతకు మించి అనేలా ఉంటాయని తెలుస్తోంది. ఒక తమిళ దర్శకుడితో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
పుష్ప.. ఫస్ట్ లుక్ నుంచే..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తున్న పుష్ప భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా ఆడియెన్స్ లో అంచనాల డోస్ అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రాగానే సోషల్ మీడియాలో నెవర్ బిఫోర్ అనేలా వైరల్ అయ్యింది.
పుష్ప పూర్తి కాకముందే..
ఇక రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినప్పుడు వచ్చిన పోస్టర్ కూడా ఆడియెన్స్ కు మంచి కిక్కిచ్చింది. సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కానున్న విషయం తెలిసిందే. పుష్ప పూర్తి కాకముందే బన్నీ కొరటాల శివ సినిమాను సెట్స్ పైకి తేనున్నాడు.
డైరెక్ట్ గా తమిళ దర్శకుడితో..
అసలు మ్యాటర్ లోకి కొరటాల శివతో సినిమా చేసిన తరువాత ఇంకా ఎవరిని ఫిక్స్ చేయలేదు. అయితే తమిళ్ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ చేయాలని బన్నీ డైరెక్ట్ గా తమిళ్ దర్శకుడితో సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం బన్నీ పందెంకోడి డైరెక్టర్ లింగు స్వామితో రెండు భాషల్లో ఒకేసారి సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు.
ఆ సినిమా పూర్తయిన తరువాత
ఇక ఇప్పుడు మరో సీనియర్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం లవ్ స్టోరీస్ తోనే కాకుండా యాక్షన్ డ్రామా కథలతో పలు బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న గౌతమ్ వాసుదేవ్ బన్నీ కోసం యాక్షన్ కథను రెడీ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. పుష్ప పూర్తయిన తరువాత అల్లు అర్జున్, ఆ దర్శకుడితో మరోసారి చర్చలు జరపాలని అనుకుంటున్నాడట. మరి దర్శకుడు బన్నీ కోసం ఎలాంటి కథ సెట్ చేస్తాడో చూడాలి.