AA24: 1160 కోట్ల డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మూవీ.. వాళ్లిద్దరి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే!

బడా సినీ బ్యాగ్రౌండ్‌తోనే హీరోగా పరిచయం అయినా.. తనదైన టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇలా సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో ఎన్నో హిట్లను అందుకుని టాప్ హీరోగా మారాడు. దీనికితోడు సుకుమార్ తెరకెక్కించని 'పుష్ప ది రైజ్' చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ ఊపులోనే అతడు కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఇప్పుడు అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

బడా స్టార్.. నేషనల్ అవార్డ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ద రైజ్'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ హిట్ అయింది. ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక, ఈ చిత్రంతో బన్నీకి నేషనల్ అవార్డు దక్కింది.

Allu Arjun Next Movie Confirmed With Jawan Director Atlee

రూల్ చేయడానికి రెడీగానే
అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న 'పుష్ప ది రూల్'లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తైంది. దీన్ని మొదటి భాగం కంటే హై రేంజ్‌లో తీస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

భద్రకాళీగా మారుతుండు
ఇప్పటికే అల్లు అర్జున్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక, ఈ చిత్రానికి 'భద్రకాళీ' అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Allu Arjun Next Movie Confirmed With Jawan Director Atlee

గురూజీతో మరోసారి మూవీ
తన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో అల్లు అర్జున్ ఇద్దరు దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేశాడు. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయనతో ఈ స్టార్ హీరో గతంలో'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల.. వైకుంఠపురములో' వంటి మూవీలు చేశాడు. ఈ మూడు సక్సెస్‌ల తర్వాత వీళ్లిద్దరూ మరో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

అట్లీతో మూవీ చేస్తున్నాడు
ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్న అల్లు అర్జున్.. త్వరలోనే సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. అట్లీతో బన్నీ సినిమా కన్ఫార్మ్ అయిపోయిందట. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుందని, దీనికి అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడని తెలిసింది.

Allu Arjun Next Movie Confirmed With Jawan Director Atlee

ఇద్దరికే 180 కోట్లు అంటూ
జవాన్‌తో 1160 కోట్ల కలెక్షన్లను అందుకున్న అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్టును ఏప్రిల్ 8వ తేదీన అనౌన్స్ చేయబోతున్నారట. ఇక, ఈ సినిమాకు గానూ బన్నీకి ఏకంగా రూ. 120 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలిసింది. అలాగే, అట్లీ ఈ చిత్రం కోసం రూ. 60 కోట్లు చార్జ్ చేస్తున్నాడని తెలిసింది. మరి ఈ మూవీ బడ్జెట్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X