రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' తర్వాత ఏ సినిమాకు కమిట్ కాలేదు. సాధారణంగా ఆయన స్థాయి హీరోలంతా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు సైన్ చేయడం లాంటివి చేస్తారు. కానీ బన్నీ చివరి మూవీ విడుదలై నెల రోజులైనా ఇంకా ఏ ప్రాజెక్టుకు కమిట్ కాలేదు. పలువురు దర్శకులు, నిర్మాతలు ఆయన్ను కలిసి కథల మీద కథలు చెబుతున్నా దేనికీ సాటిస్ఫై కావడం లేదట. సినిమా మొదలు పెట్టడం కాస్త లేటైనా మంచిదే.... కొడితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని బన్నీ గట్టిగా కూర్చున్నాడని తెలుస్తోంది. ఎట్టకేలకు బన్నీకి ఓ కథ నచ్చినట్లు తాజా సమాచారం.

విక్రమ్ కుమార్‌కు ఓకే చెబుతాడా?
దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన కథ బన్నీకి నచ్చిందని, అయితే దాన్ని ఇంకా ఆయన ఫైనల్ చేయలేదని సమాచారం. యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని టాక్.

రూ. 100 కోట్ల బడ్జెట్ అవసరం
విక్రమ్ కుమార్ చెప్పిన కథను భారీగా తీయాల్సి ఉంటుందని, రూ. 100 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే స్టైలిష్ స్టార్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా అవుతుంది.

పారిస్ వెకేషన్లో ఉన్న అల్లు అర్జున్
ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలసి పారిస్ వెకేషన్లో ఉన్నారు. ఆయన ఇండియా తిరిగి వచ్చిన తర్వాత విక్రమ్ కుమార్ చెప్పిన ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

బ్లాక్ బస్టర్ కొట్టాలని కసిగా ఉన్న బన్నీ
రేసు గుర్రం, సరైనోడు తర్వాత బన్నీకి ఆ స్థాయి హిట్స్ పడలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న ‘నా పేరు సూర్య' చిత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈ సారి కొడితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకుని మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











