స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ చిత్రానికి ఏకంగా 50కోట్లు బడ్జెట్...
తెలుగు సినిమా బడ్జెట్ ఈవేళ అంతకంతకు పెరిగిపోతోంది. ఒకళ్లని చూసి మరొకళ్లు పెంచేసుకుంటున్నారు. తమ మార్కెట్, స్థాయిలను మరచి మరీ చిత్రనిర్మాణానికి ఖర్చు పెట్టేస్తున్నారు. ఈవేళ స్టార్ హీరో సినిమా అంటే మినిమం 30 కోట్లు అవుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న 'బద్రీనాథ్' సినిమా బడ్జెట్ 40 కోట్లు అంటున్నారు. ఇదే ఎక్కువనుకుంటుంటే, దీని తర్వాత అర్జున్ చేయబోయే సినిమా బడ్జెట్ 50 కోట్లట!
'బద్రీనాథ్' రిలీజ్ తర్వాత ఈ సినిమా ప్రారంభం అవుతుంది. దీనికి సెల్వ రాఘవన్ ('ఆడు వారి మాటలకు అర్ధాలు వేరులే' ఫేం) దీనికి దర్శకుడు. ఇందులో గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. చారిత్రిక కథాంశంతో కూడిన ఈ కథ అర్జున్ కి బాగా నచ్చి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి దీనిని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. వేసవి తర్వాత సెట్స్ కు వెళ్లే ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది


Click it and Unblock the Notifications











