పుష్ప 2 తర్వాత తమిళ దర్శకుడితో అల్లు అర్జున్.. మల్టీస్టారర్ మూవీలో ఐకాన్ స్టార్‌తో ఆ టాప్ హీరో!

పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఇండస్ట్రీ చూపంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పైనే కేంద్రీకృతమై ఉంది. దాదాపు 5 ఏళ్లుగా ఒకే సినిమా కోసం పనిచేస్తూ పలువురు దర్శకులను వెయిటింగ్‌లో ఉంచారు. అయితే ఇలాంటి విజయం తర్వాత ఆయన ఎవరికి అవకాశం ఇస్తారనే అంశంపై భారీగా చర్చ జరిగింది. అయితే అల్లు అర్జున్ తన సినిమాల విషయంలో చాలా అచీతూచీ.. కెరీర్ పరంగా అడుగులేస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ పెంచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటించే తదుపరి సినిమా ఏమిటంటే? అనే విషయం వచ్చినప్పుడు.. అభిమానులు, సినీ వర్గాల నుంచి వినిపించిన పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయనతో ఇప్పటికే రెండు, మూడు సినిమాలు చేసి 100 పర్సంట్ స్ట్రైక్ రేట్‌తో ఉన్న ఆయనతోనే సినిమా చేస్తారని అనుకొన్నారు. కానీ ఐకాన్ స్టార్ మాత్రం త్రివిక్రమ్‌కు హ్యాండిచ్చి.. తమిళ దర్శకుడితో చేతులు కలిపారనే విషయం వెలుగులోకి వచ్చింది.

Allu Arjun next movie with Atlee after Pushpa 2 Siva Karthikeyan to play Crucial role in Multi Starrer

పుష్ప 2 తర్వాత జవాన్ లాంటి హిట్ కొట్టిన అట్లీతో అల్లు అర్జున్ చేతులు కలిపారనే విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అయితే ఈ సినిమా సోలో కాకుండా మల్టీ స్టారర్ అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సినిమా కథను ముందు సల్మాన్‌కు అట్లీ ఒకే చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల సల్లూ భాయ్‌ను పక్కన పెట్టి అల్లు అర్జున్‌తో చేతులు కలిపారనే విషయం బాలీవుడ్‌లో చర్చ జరుగుతున్నది.

ఏడాది కాలంగా వేచి ఉన్న సల్మాన్ ఖాన్‌ను కాకుండా అల్లు అర్జున్‌తో సినిమాను ఒకే చేయించిన అట్లీ.. మరో హీరోను ఫైనల్ చేసినట్టు సమాచారం. అయితే సల్మాన్‌ను వెయిట్ చేయించినందుకు ఆయన క్షమాపణలు చెప్పి ఈ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ పనులను వేగవంతం చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడనున్నదని సినీ వర్గాలు వెల్లడించాయి.

Allu Arjun next movie with Atlee after Pushpa 2 Siva Karthikeyan to play Crucial role in Multi Starrer

అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో అల్లు అర్జున్‌తో మరో తమిళ హీరో కూడా నటించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు.. అమరన్ సినిమాతో మంచి స్వింగ్‌లో ఉన్న శివ కార్తీకేయన్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్ కాగా.. శివ కార్తీకేయన్ కీలకమైన పాత్రలో నటించనున్నారు అని సినీ వర్గాలు వెల్లడించడమే కాకుండా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

అట్లీ రూపొందించిన జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలో 770 కోట్లు, విదేశాల్లో 400 కోట్లతో మొత్తంగా 1170 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం 1857 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇలాంటి ఇద్దరు ఫిల్మ్ మేకర్ కలిసి ప్రాజెక్టు చేస్తున్నారంటే ఆ అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు.

More from Filmibeat

Read more about: allu arjun atlee siva karthikeyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X