Don't Miss!
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అల్లు అర్జున్ మీద ఏమిటిదంతా?... విక్రమ్ కుమార్ నుండి కరణ్ జోహార్ వరకు!
ఒక స్టార్ హీరో సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రస్తుతం అల్లు అర్జున్ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బట్టి అర్థం చేసుకోవచ్చు. 'నా పేరు సూర్య' తర్వాత బన్నీ ఏ సినిమాకు కమిట్ కాకపోవడం, ఏ దర్శకుడికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వక పోవడంతో ఇటు అభిమానుల్లోనూ అయోమయం నెలకొంది. మరో వైపు బన్నీ ఈ దర్శకుడి కమిట్మెంట్ ఇచ్చాడు, ఆ దర్శకుడితో చేసే అవకాశం ఉందంటూ రోజుకో పుకారు ప్రచారంలోకి వస్తుండటంతో ఏది నమ్మాలో అర్థం కాక ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు. కేవలం టాలీవుడ్ దర్శకులు మాత్రమే కాదు బాలీవుడ్ దర్శకుల పేర్లు సైతం వినిపిస్తున్నాయి.
ఆ దర్శకుడి పేరు బలంగా.., కానీ క్లారిటీ ఇవ్వడం లేదే?
24, మనం, హలో చిత్రాల ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని కొన్ని రోజులుగా బలంగా ప్రచారం జరుగుతోంది. అయితే అల్లు అర్జున్ నుంచి మాత్రం ఈ విషయంలో అఫీషియల్ ప్రకటన రావడం లేదు. అయితే అభిమానుల్లో మాత్రం ఇతడితో సినిమా ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు నమ్మకం ఏర్పడింది. అంతలోనే ఈ ప్రాజెక్ట్ రద్దయిందనే షాకింగ్ వార్తలు సైతం ప్రచారంలోకి వచ్చాయి.
ఆ ఇద్దరు దర్శకుల పేర్లు కూడా
మరో వైపు దర్శకుడు మారుతి, పరశురాం పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరితో సినిమాలు భవిష్యత్తులో ఉండొచ్చు కానీ... నెక్ట్స్ మూవీ అయితే వీరితో ఉండక పోవచ్చని అంటున్నారు. అభిమానులు కూడా ఈ దర్శకులతో ఇప్పుడు సినిమా చేయకపోవడమే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
త్రివిక్రమ్ కోసం వెయిటింగ్ అంటూ ప్రచారం
తనకు గతంలో ‘జులాయి' లాంటి హిట్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని బన్నీ వెయిట్ చేస్తున్నారనే వార్తలు సైతం ప్రకారంలోకి వచ్చాయి. మరి ఇది ఎప్పటికి నిజం అవుతుందో చూడాలి.
చివరకు కరణ్ జోహార్ పేరు కూడా
మరో వైపు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా బన్నీతో బాలీవుడ్లో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని, ఇటీవలే ఇద్దరూ కలిశారని టాక్. అయితే బన్నీ ఏ నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు.
బన్నీ నుండి క్లియర్ స్టేట్మెంట్ కోసం వెయిటింగ్
అయితే బన్నీ విషయంలో ఇలా రోజుకో పుకారు తెరపైకి వస్తుండటంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. పుకార్లకు తెర దించుతూ బన్నీ నుండి ఒక క్లియర్ స్టేట్మెంట్ వస్తే బావుంటుంది అని వారు వెయిట్ చేస్తున్నారు.