ఆ స్టార్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా..ఇక బాక్సాఫీస్ రికార్డులు దద్దరిల్లాల్సిందే..

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'పుష్ప' ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. ఈ సక్సెస్ తో తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్లానింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న బన్నీ, ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ఇకపై చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా గ్లోబల్ లెవెల్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా గురించి ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.

ఇదే సమయంలో బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న 'ధురంధర్: ది రివెంజ్' మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ పేరు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. యాక్షన్, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు దేశభక్తి భావనను స్టైలిష్‌గా చూపించిన ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా సినీ చరిత్రలో కొత్త రికార్డులను నమోదు చేస్తూ సంచలనంగా మారింది.

Allu Arjun Next with Dhurandhar Director Aditya Dhar Project Buzz After Massive Box Office Success

ప్రపంచవ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ.750 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించడం విశేషం. రిలీజ్‌కు ముందే పెయిడ్ ప్రివ్యూల ద్వారా రూ.43 కోట్లు రాబట్టిన ఈ సినిమా, తర్వాత రోజురోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆదివారం ఒక్కరోజే దేశీయంగా రూ.115 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ధురంధర్ బాక్సాఫీస్ ప్రయాణంలో బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా సాధించిన రూ.287 కోట్ల ఓపెనింగ్ వీకెండ్ రికార్డును కూడా 'ధురంధర్ 2' సులభంగా అధిగమించింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా జోరు తగ్గకుండా కొనసాగుతూ రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి గ్లోబల్ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోంది.

ఇలా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తు్న్న ధురంధర్ 2 చూసిన అల్లు అర్జున్, తన సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 'Patriotism with Swag... ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, దర్శకుడు ఆదిత్య ధర్‌ను ఆకాశానికెత్తేయడం ఇండస్ట్రీలో కొత్త చర్చలకు దారితీసింది. ముఖ్యంగా రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురిపించడంతో పాటు, 'ఇండియన్ సినిమా దగ్గర ఇలాంటి దర్శకుడు ఉండటం గర్వకారణం' అని చెప్పడం గమనార్హం.

ఈ ట్వీట్‌తోనే అల్లు అర్జున్ - ఆదిత్య ధర్ కాంబినేషన్‌పై ఉన్న పుకార్లు మరింత బలపడ్డాయి. ఇప్పటికే 'అశ్వద్ధామ' అనే డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఆదిత్య ధర్ బన్నీతో చర్చలు జరిపాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన రాకపోయినా, ఇప్పుడు బన్నీ ఇచ్చిన స్పందన చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ నిజమయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ సింగిల్ హీరో మూవీగా వస్తుందా? లేక మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతుందా? అన్నదే.

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, ఇది పాన్ ఇండియా లెవెల్‌లోనే కాకుండా పాన్ వరల్డ్ రేంజ్‌లో భారీ సెన్సేషన్ అవుతుందని చెప్పొచ్చు. అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కూడా ఆదిత్య ధర్ ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడనే మరో రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలపై బాలీవుడ్ టాప్ డైరెక్టర్ల ఫోకస్ పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

'ధురంధర్ 2' సక్సెస్ తో ఆదిత్య ధర్ రేంజ్ ఒక్కసారిగా పెరగడంతో, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా ఆయనతో కలిసి పని చేయాలనే ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ కాంబినేషన్ నిజంగా వర్కౌట్ అవుతుందా? సింగిల్ హీరో ప్రాజెక్ట్‌గా వస్తుందా? లేక మల్టీ స్టారర్‌గా సర్‌ప్రైజ్ ఇస్తుందా? అన్నది తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X