అల్లు అర్జున్ టార్చర్, కిక్కురు మనకుండా పూరి?
హైదరాబాద్: 'దేశముదురు' లాంటి హిట్ తర్వాత పూరి జగన్నాథ్-అల్లు అర్జున్ కలిసి నటిస్తున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బన్నీనీ లవర్ బాయ్‌లా చూపెట్టబోతున్నాడు దర్శకుడు పూరి. అయితే పూరి తీరు అల్లు అర్జున్‌కి నచ్చడం లేదని ఓ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది.
తనకున్న స్టైలిష్ స్టార్ ఇమేజ్‌ని మరింత పెంచుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్... పూరి జగన్నాథ్ తీరుతో చాలా అసంతృప్తిగా ఉన్నాడని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే స్టైల్ విషయంలో తన నిర్ణయాలే నెగ్గేలా పూరిపై ఒత్తిడి తెస్తున్నాడని, చాలా సీన్లు తనకు నచ్చిన విధంగా ఎడిట్ చేయించుకుంటున్నాడని టాక్.
అయితే అల్లు అర్జున్‌కు ఉన్న బ్యాగ్రౌండ్ నేపథ్యంలో... పూరి బన్నీ నిర్ణయాలను అడ్డు చెప్పలేక పోతున్నాడని, బన్నీ టార్చర్ భరిస్తూ పని కానిస్తున్నాడని గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఈవార్తల్లో నిజా నిజాలు తేలాల్సి ఉంది. సినిమా వివరాల్లోకి వెళితే... ఇద్దరమ్మాయిలతో చిత్రం అక్టోబర్ 18, 2012న రామానాయుడు స్టూడియోలో మొదలైంది. నవంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం సమ్మర్లో విడుదలకు సిద్ధం అవుతోంది.
ఇందులో అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.


Click it and Unblock the Notifications











