అల్లు అర్జున్ కి బాలీవుడ్ ఆఫర్
అల్లు అర్జున్ కి ఇప్పుడు హిందీలో పేరున్న యాష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ నుంచి ఆఫర్ వచ్చినట్లుగా అంతటా వినపడుతోంది. అయితే ఇది రూమరా లేదా అనేది కన్ఫర్మ్ కాకపోయినా ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో సౌత్ హీరో అవసరమై అల్లు అర్జున్ ని పిలిచి మాట్లాడటం జరిగిందని చెప్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ మార్కెట్ కు పరిచయమయ్యే అవకాశమున్నా అల్లు అర్జున్ డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక నో చెప్పే అవకాశముందని వినికిడి.
అతని సన్నిహితులు అంతా అంత పెద్ద సంస్ధ ద్వారా అక్కడ పరిచయమైతే అందరి దృష్టిని తేలిగ్గా గ్రాబ్ చేయవచ్చని చెప్తున్నారుట. అయితే ఇప్పటివరకూ అల్లు అర్జున్ ఏ కన్ఫర్మేషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ తాజా చిత్రం బద్రీనాధ్ ఫెయిల్యూర్ కావటంతో ముందుగా సౌత్ సినిమా పై శ్రద్ద పెట్టి మరో హిట్ అర్జంటుగా ఇవ్వాల్సిన అవసరం ఉందని అల్లు అరవింద్ అభిప్రారయపడుతున్నారు. ఇక సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి అల్లు అర్జున్ మరో చిత్రం ప్రారంభం కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తారు. చిత్రానికి హనీ అనే టైటిల్ పెట్టినట్లు అంతటా వినపడుతోంది.


Click it and Unblock the Notifications











