రామ్ చరణ్ సెన్సేషనల్ డెసీషన్: పవన్ కల్యాణ్ తర్వాత రంగంలోకి మెగా పవర్ స్టార్‌.!

By Manoj Kumar P

'చిరుత' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్. మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోగా వచ్చినప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకోవడం కోసం అతడు ఎంతగానో శ్రమిస్తున్నాడు. ఇందులో భాగంగానే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. దీంతో భారీ విజయాలను కూడా అందుకుంటున్నాడు. ఇదిలాఉండగా... రామ్ చరణ్ తాజాగా తన ఫ్యూచర్‌ ప్లాన్‌లో భాగంగా ఓ సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలేంటో చూద్దాం పదండి.!

చిరంజీవి కోసం చరణ్ ద్విపాత్రాభినయం

చిరంజీవి కోసం చరణ్ ద్విపాత్రాభినయం

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో రామ్ చరణ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో.. టాప్ ప్లేస్‌పై కన్నేశాడు. ఇలాంటి సమయంలోనే అతడు తన తండ్రి చిరంజీవి కోసం నిర్మాతగా మారాడు. కొణిదెల ప్రొడక్షన్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి హీరోగా, నిర్మాతగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

చరిత్ర సృష్టించేందుకు అతడితో కలిశాడు

చరిత్ర సృష్టించేందుకు అతడితో కలిశాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

చిరంజీవి సినిమాలో చరణ్ కీలక పాత్ర

చిరంజీవి సినిమాలో చరణ్ కీలక పాత్ర

RRR షూటింగ్‌ జరుగుతుండగానే రామ్ చరణ్... మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే... తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య'లో. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో చరణ్ నక్సలైట్‌గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర కథను మలుపు తిప్పుతుందని అంటున్నారు.

ఆ విషయంలో క్లారిటీ ఇవ్వని చరణ్

ఆ విషయంలో క్లారిటీ ఇవ్వని చరణ్

రామ్ చరణ్ నటించిన గత చిత్రం ‘వినయ విధేయ రామ' విడుదలై దాదాపు ఏడాదిన్నర పైగానే కావొస్తుంది. దాని తర్వాత RRR మూవీ చేస్తున్న అతడు... ఆచార్యలోనూ నటించనున్నాడు. అయితే, ఆ తర్వాత చెర్రీ నటించే సినిమా విషయంలో క్లారిటీ మాత్రం రావడం లేదు. మరోవైపు, సహచర నటుడు ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులు ప్రకటిస్తూనే ఉన్న విషయం తెలిసిందే.

మెగా పవర్ స్టార్ సెన్సేషనల్ డెసీషన్

మెగా పవర్ స్టార్ సెన్సేషనల్ డెసీషన్

రామ్ చరణ్ తదుపరి చిత్రానికి సంబంధించి ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. అదే సమయంలో చాలా మంది దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో మెగా అభిమానుల్లో అయోమయం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మెగా పవర్ స్టార్ తన తర్వాతి సినిమా విషయంలో సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్నాడని తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
పవన్ తర్వాత రామ్ చరణ్ సినిమానే.!

పవన్ తర్వాత రామ్ చరణ్ సినిమానే.!

ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్'. ఈ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ గతంలో అల్లు అర్జున్ కోసం ‘ఐకాన్' అనే కథ రాశాడు. అయితే, అనివార్య కారణాలతో దాన్ని అతడు వదిలేశాడు. ఇప్పుడదే కథతో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడట. నిర్మాత దిల్ రాజు సమక్షంలో ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X