For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఐకాన్’ నుంచి అల్లు అర్జున్ ఔట్: అతడు తప్పుకున్నది అందుకే.. మరో హీరోతో దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్టు!

  |

  సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలను ప్రకటిస్తుంటారు. అయితే, వాటిలో అన్నీ పట్టాలెక్కుతాయని చెప్పలేం. అలాంటి వాటిలో అల్లు అర్జున్ 'ఐకాన్.. కనబడుటలేదు' అనే ప్రాజెక్టు ఒకటి. చాలా కాలం క్రితమే దీన్ని అనౌన్స్ చేసినా.. ఇప్పటి వరకూ ఇది ప్రారంభం కాలేదు. సో.. ఈ సినిమా ప్రకటనకే పరిమితం అయిందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు ఇటీవల ఈ మూవీ గురించి మాట్లాడడంతో మరోసారి 'ఐకాన్' తెరపైకి వచ్చింది. ఇలాంటి సమయంలో ఈ మూవీ నుంచి అల్లు అర్జున్ తప్పుకున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ఆసక్తిని రేకెత్తించి.. ఊసూరుమనిపించాడు

  ఆసక్తిని రేకెత్తించి.. ఊసూరుమనిపించాడు

  దాదాపు మూడేళ్ల క్రితమే ‘ఐకాన్.. కనబడుటలేదు' అనే సినిమాను ప్రకటించాడు అల్లు అర్జున్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు దీన్ని నిర్మిస్తారని వెల్లడించారు. డిఫరెంట్ పోస్టర్‌తో అనౌన్స్ చేయడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి వచ్చేసింది. కానీ, ఈ సినిమాను ప్రారంభించనే లేదు. దీంతో ఈ ప్రాజెక్టు కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేచి చూస్తూనే ఉన్నారు.

  అప్పుడు ‘అల’గా.. ఇప్పుడు పుష్పరాజ్‌గా

  అప్పుడు ‘అల’గా.. ఇప్పుడు పుష్పరాజ్‌గా

  ‘ఐకాన్' ప్రకటించిన తర్వాత అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ‘అల.. వైకుంఠపురములో' అనే సినిమాను చేశాడు. దాని తర్వాత అయినా ఇది ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ‘పుష్ప' అనే సినిమాను చేస్తున్నాడు. సుకుమార్ రూపొందిస్తోన్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తోంది.

  ‘వకీల్ సాబ్’ హిట్‌తో మరోసారి ‘ఐకాన్’ అని

  ‘వకీల్ సాబ్’ హిట్‌తో మరోసారి ‘ఐకాన్’ అని

  అల్లు అర్జున్‌తో చేయాల్సిన ‘ఐకాన్' పట్టాలెక్కకపోవడంతో.. దర్శకుడు వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్' సినిమాను రూపొందించాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దర్శకుడిగా వేణు ప్రతిభకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో అతడి తర్వాతి సినిమా ఐకాన్ గురించి చర్చలు వచ్చాయి.

  దిల్ రాజు వ్యాఖ్యలతో స్పష్టత వచ్చేసింది

  దిల్ రాజు వ్యాఖ్యలతో స్పష్టత వచ్చేసింది


  ‘వకీల్ సాబ్' మూవీ విజయంతో దిల్ రాజు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో తమ బ్యానర్‌లో రాబోయే తర్వాతి చిత్రం ‘ఐకాన్' అని వెల్లడించారు. దీన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కించబోతున్నాడని కూడా ప్రకటించారు. దీంతో ఈ చిత్రంపై స్పష్టత వచ్చేసింది.

  ‘ఐకాన్’ మూవీ నుంచి అల్లు అర్జున్ ఔట్

  ‘ఐకాన్’ మూవీ నుంచి అల్లు అర్జున్ ఔట్


  దిల్ రాజు ‘ఐకాన్' మూవీ ఉంటుందని చెప్పారు. కానీ, అందులో అల్లు అర్జునే నటిస్తాడని మాత్రం గట్టిగా చెప్పలేదు. ఇక, ఐకాన్ స్టార్ వర్గం నుంచి కూడా ఈ ప్రాజెక్టు గురించి స్పందన రావట్లేదు. దీంతో అసలు ఇందులో అతడు నటిస్తున్నాడా? లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఈ మూవీ నుంచి బన్నీ తప్పుకున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

  Pushpa Action Scenes Visual Treet, సుక్కు మార్క్ ట్విస్ట్ | Allu Arjun || Filmibeat Telugu
  మరో హీరోతో దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్టు ఓకే

  మరో హీరోతో దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్టు ఓకే

  తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం బన్నీ కొన్ని మార్పులు చేయమని చెప్పగా.. అందుకు దర్శకుడు వేణు, నిర్మాత దిల్ రాజు నిరాకరించారట. అలాగే, రెమ్యూనరేషన్ కూడా అప్పటిలా కాకుండా పెంచమని కోరాడని తెలిసింది. దీనికి కూడా దిల్ రాజు ఒప్పుకోలేదని అంటున్నారు. ఈ కారణాల వల్లే బన్నీ తప్పుకున్నాడని తెలిసింది. ఇప్పుడిదే మూవీ వేరే హీరోతో చేస్తారని టాక్.

  English summary
  Venu Sriram is an Indian film screenwriter and director known for his works primarily in Telugu cinema. In 2011 he directed Oh My Friend. In 2017, he directed MCA (Middle Class Abbayi). produced by Dil Raju Under His Own Production house Sri Venkateswara Creations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X