ఆ ఇద్దరికి ముఖం చాటేసిన అల్లు అర్జున్.. పుష్ప 2 హిట్ తర్వాత ఐకాన్ స్టార్ షాకింగ్‌గా!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోను, మీడియాలోను అత్యధికంగా వినిపిస్తున్న స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత ఆయనతో సినిమాలు చేయడానికి పాన్ ఇండియా వైడ్‌గా టాప్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లందరూ క్యూ కట్టారు. కానీ టాప్ డైరెక్టర్లను కూడా పక్కన పెట్టేసే తనకు ఇష్టమైన ప్రాజెక్టులకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. పుష్ప 2 సినిమాకు ముందు ఆయనతో చర్చలు జరిపి దాదాపు ఓకే అయిన రెండు ప్రాజెక్టులు ఆయన చేతి నుంచి జారిపోవడం వివాదంగా మారింది. ఆ రెండు ప్రాజెక్టులు, ఆ ఇద్దరు డైరెక్టర్లు ఎవరంటే?

ఫుష్ప 2 సినిమామకు ముందు ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో అల్లు అర్జున్ ప్రాజెక్టులను దాదాపు ఒకే అయిన పరిస్థితి అని సినీ వర్గాల టాక్. కానీ ఆ సినిమా హిట్ తర్వాత తర్వాత చేయాల్సిన సినిమాల విషయంలో ఐకాన్ స్టార్ మరోసారి పునరాలోచనలో పడ్డారు. దాంతో తన నిర్ణయాలన్నీ మార్చుకొని పాన్ వరల్డ్ కథల కోసం ప్రయత్నించారు. ఆ క్రమంలో అట్లీ చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమా చేయాలని డిసైడ్ చేసి.. ఇద్దరు డైరెక్టర్లకు ముఖం చాటేశాడనేది తాజా సమాచారం.

Allu Arjun out of Trivikram Srinivas

అయితే అట్లీ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను గ్రాండ్ స్కేల్‌లో రూపొందించేందుకు ముందుకు రావడంతో బడ్జెట్ అంశాలు కూడా ఆయనను ప్రభావితం చేశాయి. ఖర్చుకు వెనుకాడకుండా తనపై గ్లోబల్ ఆడియెన్స్‌ను ప్లీజ్ చేసే విధంగా సినిమాలు నిర్మించే వారిపై ప్రస్తుతం స్టైలిష్ స్టార్ దృష్టి పెట్టారు. ఆ కారణంగానే తెలుగు ఇండస్ట్రీకి చెందిన రెండు ప్రాజెక్టులకు మంగళం పాడారనేది మీడియాలో భారీ చర్చ జరుగుతున్నది.

పుష్ప 2 సినిమాకు ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాను చేయాల్సి ఉంది. మైథాలాజికల్ టచ్‌తో సాగే పాన్ వరల్డ్ మూవీలో కార్తీకేయుడి పాత్రను పోషించాల్సి ఉందని తాజాగా డెవలప్‌మెంట్స్ ద్వారా స్పష్టమైంది. ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ చాలా గొప్పగా చెప్పి.. ప్యాన్ వరల్డ్ మూవీగా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ సినిమాను అల్లు అర్జున్ వదులుకోవడంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలోకి వెళ్లింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారికంగా ప్రకటన రానున్నది.

Kuberaa First Review: కుబేరా మూవీ ఫస్ట్ రివ్యూ
https://telugu.filmibeat.com/reviews/kuberaa-censor-board-review-dhanush-nagarjuna-akkineni-crafted-the-movie-master-class-157333.html

ఇక పుష్పకు ముందు సందీప్ రెడ్డి వంగతో ఓ సినిమా చేసేందుకు అంతా సిద్దమైంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత అది పట్టాలెక్కుతుందని అందరూ భావించారు. కానీ అట్లీ ప్రాజెక్టు తర్వాత సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ అటకెక్కింది. దాంతో ఈ సినిమాపై క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం రాంచరణ్‌తో యానిమల్ డైరెక్టర్ సినిమా ఒకే అయిందనేది తాజా సమాచారం. అల్లు అర్జున్ ఇలా రెండు ప్రాజెక్టులు వదులుకోవడంపై రకరకాల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో దాదాపు సెట్స్‌పైకి వెళ్లాల్సిన వకీల్ సాబ్ ఫేమ్ వేణు దర్శకత్వంలో ఐకాన్ సినిమాను కూడా చివరి నిమిషంలో రిజెక్ట్ చేయడం కూడా మరోసారి చర్చకు వచ్చింది.

అట్లీ మూవీ తర్వాత కూడా అల్లు అర్జున్ ప్రాజెక్టులు ఇతర భాషా డైరెక్టర్లతో ఉంటాయి. ప్రస్తుతం ఇంకా చర్చల దశలోనే పలు ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళంలో టాప్ డైరెక్టతో కథా చర్చలు జరుగుతున్నాయి. వాటిని ఫైనలైజ్ చేస్తే.. ఇక రెండు, మూడు ఏళ్ల వరకు తెలుగు దర్శకులకు ఐకాన్ స్టార్ దూరమే అనే విషయం సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది. అట్లీ తర్వాత ఆయన ఏం సినిమా చేస్తారనే విషయంపై అందరూ ఆసక్తిగా దృష్టిపెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X