బాలీవుడ్ బడా దర్శకుడితో అల్లు అర్జున్ న్యూ ప్రాజెక్ట్.. నెవ్వర్ బిఫోర్ ప్లాన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా, హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామ లింగయ్య మనవడిగా సినీ రంగంలో అడుగు పెట్టినప్పటికీ.. ఈయనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. మధ్యలో ఎన్ని హిట్స్ వచ్చినా కూడా అల వైకుంఠపురములో సినిమాతో మాత్రం మర్చిపోలేని మరో బిగ్ హిట్ అందుకున్నాడు. ఇక పుష్ప సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా పుష్ప-2 సినిమాలో నటిస్తూ మరింత బిజీగా గడుపుతున్నాడు.

అయితే పుష్ప 2 అనంతరం 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగాతో సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడు, ఎలాంటి సినిమాలో నటిస్తాడనే దానిపై ఆయన అభిమానులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆయన భవిష్యత్ మూవీ గురించి అప్ డేట్ ఇస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నెట్టింట ఓ వార్త వైరల్ గా మారింది. స్టైలిష్ స్టార్ వచ్చే ఏడాది మరో రెండు సినిమాలు చేస్తున్నాడంటూ తెగ వార్తలు వస్తున్నాయి.

Allu arjun planing another big project with bollywood star director

తాజాగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో బన్నీ సినిమా చేయబోతున్నాడంటూ పుకార్లు వస్తున్నాయి. పీరియాడిక్ కథలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను పెంచుకున్న స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో బన్నీ టీమ్ చర్చలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీ తన ఫ్యూచర్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్లందరినీ లైన్ లో పెడుతున్నారట. ఈ క్రమంలోనే భన్సాలీతో టచ్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

సంజయ్ లీలా భన్సాలీతో సినిమా అంటే కచ్చితంగా మంచి బజ్ ఉంటుంది. బాలీవుడ్ లో సినిమా చేయడం ద్వారా పాన్ ఇండియా సినిమా చేసినట్లూ ఉంటుంది. అదే సమయంలో తెలుగులో సరైన సినిమా చేసినట్లు కూడా ఉంటుంది. అలా అని అల్లు అర్జున్ టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ తగ్గించలేదు. ఓ వైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సురేందర్ రెడ్డి లాంటి వాళ్లను కూడా లైన్ లో ఉంచుతున్నాడు. మరి చూడాలి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X