మరో ఇద్దరు పాన్ ఇండియా దర్శకులను లైన్ లో పెడుతున్న అల్లు అర్జున్.. ప్రభాస్ డైరెక్టర్ కూడా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం యువ హీరోలు స్టార్ హీరోలు అని తేడా లేకుండా అందరూ కూడా తన సినిమాల వైపు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఒక్కసారి పాన్ ఇండియా వైపు అడుగు వేస్తే మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. వీలైనంత వరకు సోలోగా నేషనల్ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని భాషల వారికి నచ్చే విధంగా ఉండాలని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇక నేటి తరం దర్శకులు కూడా గ్లోబల్ కథలతో ముందుకు వస్తూ ఉండటం విశేషం. అల్లు అర్జున్ కూడా ఇటీవల మరో ఇద్దరు దర్శకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వారితో కూడా పాన్ ఇండియా సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రికార్డులను బ్రేక్ చేసేలా..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో పవర్ ఫుల్ గా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆర్య సినిమాల తర్వాత దర్శకుడు సుకుమార్ కలయికలో వస్తున్న మూడో సినిమా పుష్ప పై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ను సరికొత్తగా ప్రజెంట్ చేస్తుండడం విశేషం.

సమయానికి తగ్గట్టుగా..
ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో పుష్ప సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇక హిందీలో కూడా సినిమాను భారీగా విడుదల చేయాలని చూస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సినిమా పాటలకు మంచి క్రేజ్ అయితే దక్కింది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా ఈ సినిమా మ్యూజిక్ పై ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రిలీజ్ డేట్ ను దృష్టిలో పెట్టుకొని సమయానికి తగ్గట్లుగా సినిమా పాటలను విడుదల చేస్తున్నారు.

ఆ సినిమా ఎప్పుడు వస్తుందో..
ప్రస్తుతం పుష్ప సినిమాతో పాటు అల్లు అర్జున్ ఐకాన్ ను కూడా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుంది అనే విషయం లో చిత్రయూనిట్ సరైన క్లారిటీ ఇవ్వలేదు. బన్నీ పుష్ప 2 కంటే ముందే ఐకాన్ సినిమాను పూర్తి చేస్తారని కథనాలు వెలువడ్డాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ ఇప్పటికే సినిమా కథ మొత్తం పూర్తి చేసుకున్నాడు. దాదాపు ఈ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. బన్నీ ఓకే అంటే సెట్స్ పైకి వెళ్లడానికి దర్శకుడి తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా సిద్ధంగా ఉన్నాడు.

ప్రభాస్ దర్శకుడితో.
అల్లు అర్జున్ మరో ఇద్దరు స్టార్ దర్శకులను లైన్ లో పెట్టే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇప్పటికే కొరటాల శివ తో ఒక పాన్ ఇండియా కథకు కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్ సినిమా లేకపోయి ఉంటే కొరటాల బన్నీతో సినిమా చేసి ఉండేవారు. ఇక అల్లు అర్జున్ కోసం ప్రభాస్ రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కూడా కథను వినిపించినట్లు తెలుస్తోంది. యు.వి.క్రియేషన్స్ లోనే వారి కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందట.
Recommended Video

సందీప్ రెడ్డితో చర్చలు
అలాగే సందీప్ రెడ్డి వంగా కూడా అల్లు అర్జున్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రభాస్ తో కూడా స్పిరిట్ అనే సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కోసం కూడా అతను ఒక పాయింట్ అనుకున్నట్లు సమాచారం.. ఇటీవల బన్నీ తో కూడా చర్చలు జరిపారట.
అయితే కథను ఇంకాస్త డెవలప్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం అని కూడా బన్నీ సలహా ఇచ్చినట్లు సమాచారం. అలాగే అల్లు అర్జున్ లిస్టులో సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ కూడా ఉన్నాడు. మరి ఈ కాంబినేషన్స్ తెరపైకి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











