For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రేజీ న్యూస్.. క్రికెటర్ పాత్రలో అల్లు అర్జున్.. రాంచరణ్ తరువాత బన్నీ ప్రయత్నం!

    |
    Allu Arjun to Play a Role as Legendary Cricketer

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్ని నెలలుగా కొత్త సినిమా సన్నాహకాలతో ఉన్నాడు. నా పేరు సూర్య చిత్రం నిరాశపరచడంతో ఈ సారి ఓ మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నాడు. అందుకే సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శత్వంలో బన్నీ చిత్రం ఉంటుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ తరుణంలో బన్నీ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తిక్రమైన ప్రచారం జరుగుతోంది.

    క్రికెటర్ పాత్రలో

    క్రికెటర్ పాత్రలో

    అల్లు అర్జున్ క్రికెటర్ పాత్రలో నటించబోతున్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. ఇది బన్నీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం అని కూడా పేర్కొంది. ఇది నిజంగా క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు.

    కపిల్ దేవ్ బయోపిక్

    కపిల్ దేవ్ బయోపిక్


    బాలీవుడ్ లో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కు రంగం సిద్ధం అవుతోంది. భజరంగి భాయిజాన్ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో మరో లెజెండరీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం బన్నీని సంప్రదించినట్లు తెలుస్తోంది.

    83 పేరుతో

    83 పేరుతో


    1983 లో కపిల్ దేవ్ సారధ్యంలో ఇండియన్ క్రికెట్ టీం తొలిసారి ప్రపంచకప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఈ ప్రపంచ కప్ లో కపిల్ దేవ్, కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తుండగా, శ్రీకాంత్ పాత్రకు బన్నీ అయితే బావుంటుందని భావిస్తున్నారట. ఈ చిత్రాన్ని 83 అనే టైటిల్ తో తెరకెక్కించబోతున్నారు.

    డీల్ కుదిరితే

    డీల్ కుదిరితే

    డీల్ కుదిరితే బన్నీకి ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ అవుతుంది. బన్నీ తెలుగులో ఇప్పటికే రుద్రమదేవి వంటి చిత్రంలో గోనగన్నారెడ్డిగా ప్రత్యేక పాత్ర పోషించాడు. బన్నీ ఈ చిత్రంలో నటిస్తే సౌత్ లో కూడా 83 చిత్రానికి మంచి మార్కెట్ ఏర్పడుతుంది.

    రాంచరణ్ తరువాత

    రాంచరణ్ తరువాత

    మెగా కుటుంబం నుంచి మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇదివరకే జంజీర్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ ప్రయత్నం సత్పలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ దిశగా అడుగులు పడుతుండడంతో ఆసక్తి నెలకొంది.

    English summary
    Allu Arjun to Play as legendary Cricketer. Bunny will going to play key role in Kapil Dev biopic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X