రామ్ చరణ్ కోసం అల్లు అర్జున్ ఇమేజ్ ని అడ్డం పెడుతున్నారు
ఆరెంజ్ తో డీలా పడ్డ రామ్ చరణ్ ని మగధీర మళయాళ,తమిళ విడుదల ద్వారా ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్రమంలో మళయాళంలో ధీర టైటిల్ తో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేస్తున్నారు.మే మొదటి వారంలో విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రమోషన్ కోసం అల్లు అర్జున్ ని వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
అల్లు అరవింద్ ఆలోచన మేరకు అల్లు అర్జున్ మళయాళ టీవిల్లో కనపడి ఈ చిత్రం గురించి దంచనున్నాడు.అక్కడ తనుకున్న ఇమేజ్ ని అడ్డం పెట్టుకుని తన బావ రామ్ చరణ్ ని,తద్వారా తమ సినిమా మగధీర ని నిలబెట్టాలని ఆలోచిస్తున్నాడు.మొత్తానికి తండ్రీ,కొడుకులిద్దరివీ మాస్టర్ మైండ్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











