అల్లు అర్జున్, మంచు విష్ణు బిగ్ ఫైట్.. ప్రభాస్ అండతో పాన్ ఇండియా వార్

మళ్ళీ చాలా కాలం తర్వాత మన తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో పలు భారీ చిత్రాలు రావడం మొదలయ్యాయి. ఈ ఏడాదిలో కాస్త తక్కువ సినిమాలే వచ్చినప్పటికీ వచ్చిన కొన్ని సినిమాలు కూడా ఈ ఏడాది ప్రథమార్థంలో దుమ్ము లేపాయి. ఇక ఇదిలా ఉండగా ఈ ఏడాది ద్వితీయార్ధంలో మాత్రం మొదటి కంటే ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది.

కాగా ఈ పాన్ ఇండియా చిత్రాలు చూసినట్టు అయితే నాచురల్ స్టార్ నాని "సరిపోదా శనివారం" నుంచి కౌంట్ చేస్తే ఒకో నెలలో మినిమమ్ ఒకటి కనిపిస్తుంది. అలా డిసెంబర్ వరకు కూడా భారీ సినిమాలు వరుసగా ఫిక్స్ అయ్యి ఉన్నాయి. కాగా ఈ డిసెంబర్ లో అయితే భారీ క్లాష్ ఉండబోతుంది అని ఇప్పుడు సినీ వర్గాల్లో రూమర్స్ మొదలయ్యాయి.

allu arjun pushpa 2 clash with manchu vishnu kannappa movie

మరి ఆల్రెడీ డిసెంబర్ రిలీజ్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ ల కాంబినేషన్ భారీ చిత్రం పుష్ప సీక్వెల్ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 6ని ఫిక్స్ చేసుకుంది. కాగా ఈ సినిమాకి పోటీగా తెలుగు నుంచే కాదు హిందీలో కూడా ఏ సినిమా కూడా కనిపించలేదు కానీ తాజాగా మన టాలీవుడ్ డైనమిక్ స్టార్ హీరో మంచు విష్ణు చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ డిసెంబర్ రిలీజ్ అని ఫిక్స్ కావడంతో పుష్ప 2 పోస్ట్ పోన్ అయినట్టుగా గట్టి టాక్ సినీ వర్గాల్లో మొదలయ్యింది.

allu arjun pushpa 2 clash with manchu vishnu kannappa movie

కాగా ఇప్పటికే కన్నప్ప సినిమా గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తుండగా తాజా రూమర్ ప్రకారం పుష్ప 2 డేట్ ఏదైతే ఉందో అదే డేట్ లో కన్నప్ప కూడా దిగబోతున్నట్టుగా వినిపిస్తుంది. కాగా పుష్ప 2 ఒకవేళ ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప కంటే ఎక్కువ థియేటర్స్ కన్నప్ప సినిమాకే బుక్ అయ్యాయంటూ కూడా మరో వినికిడి. ఏపీ, తెలంగాణాలో మొత్తం 100 శాతం థియేటర్స్ లో 40 శాతం పుష్ప 2 కి 60 శాతం కన్నప్ప కి కేటాయించేలా ప్రక్రియలు జరుగుతున్నాయని అంటున్నారు.

మరి కన్నప్ప వల్ల పుష్ప 2 పోస్ట్ పోన్ అయ్యింది అనే దానికంటే ఇప్పుడు ఒకే రోజులో క్లాష్ కి వచ్చి అది కూడా పుష్ప 2 ని మించి థియేటర్స్ దక్కించుకోవడం అనే పెద్ద దెబ్బే అని చెప్పి తీరాలి. కన్నప్పపై కూడా ఇప్పుడు మంచి అంచనాలు బిల్డప్ అవుతున్నాయి. కాగా ఇందులో విష్ణుతో పాటుగా పాన ఇండియా బిగ్గెస్ట్ హీరో ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లు నటిస్తున్నారు.

allu arjun pushpa 2 clash with manchu vishnu kannappa movie

అలాగే మోలీవుడ్ నుంచి మోహన్ లాల్, తమిళ్ నుంచి నయనతార, శరత్ కుమార్ ఇంకా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లాంటి స్టెల్లార్ కాస్ట్ తో రాబోతుంది. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ సెట్ చేస్తుందో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం పుష్ప 2 లా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా భాషలు సహా ఇంగ్లీష్ లో కూడా కన్నప్ప ఏక కాలంలో విడుదల కానున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

More from Filmibeat

Read more about: manchu vishnu allu arjun prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X