Allu Arjun: పుష్ప 2 కిక్కిచ్చే పవర్ఫుల్ లీక్.. ఆ ఒక్క సీన్ చాలట!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. అలాగే గ్లిమ్ప్స్ కూడా ప్రేక్షకులకి బాగా రీచ్ అయ్యింది. దీంతో పుష్ప 2 మూవీపైన భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ మూవీతో ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకోవాలని అల్లు అర్జున్ టార్గెట్ పెట్టుకున్నారంట. ఇదిలా ఉంటే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ లపై ఐటీ దాడులు జరగడంతో షూటింగ్ కాస్తా వాయిదా పడింది. వచ్చే నెలలలో మరల ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వనుందని టాక్. ఇక ఈ మూవీని సుకుమార్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో చాలా పవర్ ఫుల్ గా ఆవిష్కరిస్తున్నారంట.

Allu arjun pushpa 2 movie another leaks on interesting scene

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని ఆడియన్స్ కి అర్ధం అయిపొయింది. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా ఇంటర్వెల్ బ్యాంగ్ ని కూడా సుకుమార్ సిద్ధం చేసారంట. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కోసం 35 రోజులు షూటింగ్ పెట్టారంట. ఫ్యాన్స్ గ్యాప్ లేకుండా విజిల్స్ వేయడానికి ఈ ఒక్క సీన్ చాలు అనే విధంగా ఉంటుందట!

Allu arjun pushpa 2 movie another leaks on interesting scene

మూవీలో ఈ సీక్వెన్స్ చాలా లావిష్ గా ఉంటాయని టాక్. ఇక ఈ సీక్వెన్స్ లో బన్నీ లుక్స్, గెటప్ మ్యాకప్ కోసం ఏకంగా 3 గంటల సమయం పడుతుందంట. గ్రాండియర్ గా ఈ సీక్వెన్స్ ఉండటంతో అందుకు తగ్గట్లుగానే ప్రతి ఫ్రేమ్ లో ఇంటెన్సిటీ కనిపించే విధంగా పెర్ఫెక్షన్ తో సుకుమార్ వాటిని డిజైన్ చేస్తున్నారంట. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా మూవీస్ లో బెస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ గా ఈ ఎపిసోడ్ ఉండిపోవాలని బలంగా ప్లాన్ చేసుకొని సుకుమార్ సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X