Pushpa 2: వైరల్ అవుతున్న మరో హై వోల్టేజ్ లీక్.. పార్ట్ 3 కోసం కూడా బిగ్ స్కెచ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్పా సెకండ్ పార్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండో భాగం కూడా అంతకుమించి అనేలా ఉంటుంది అని ఫాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై అంచనాల రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి లీక్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ సినిమాకు సంబంధించిన కొన్ని లీక్స్ కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక లేటెస్ట్ గా మరికొన్ని లీక్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలలోకి వెళితే...

Allu arjun Pushpa 2 movie latest leaks on story and action blocks

దేవిశ్రీప్రసాద్ స్పెషల్ ఫోకస్: పుష్ప పార్ట్ వన్ సౌత్ ఇండియాలో కంటే హిందీలోనే అత్యధిక స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. అల్లు అర్జున్ నార్త్ ఆడియన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేశాడో ఒక డైలాగ్ తోనే అర్థమయిపోయింది. అలాగే దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ కూడా బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కూడా అదే తరహాలో ఉండాలి అని దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ స్పెషల్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా మొత్తం ఐదు పాటల ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Allu arjun Pushpa 2 movie latest leaks on story and action blocks

ఈ ఏడాది చివరిలోపు: ఇక పుష్ప సెకండ్ పార్ట్ లో కీలకమైన కొన్ని సన్నివేశాలను ఇటీవల షెడ్యూల్ లో షూట్ చేశారు. దర్శకుడు సుకుమార్ షూటింగ్ ను ఏమాత్రం గ్యాప్ లేకుండా ఫినిష్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాను ఏడాది చివరిలోపు ఫినిష్ చేయాలి అని మొదట టార్గెట్ పెట్టుకున్నారు. అసలైతే డిసెంబర్ లోనే విడుదల చేయాలని కూడా అనుకున్నారు. కానీ అందుకు తగ్గ ప్లాన్ కుదరలేదు. ఇక ఇప్పుడు ప్లాన్ ప్రకారం సినిమా షూటింగ్ పూర్తయితే మాత్రం సినిమా 2024 సమ్మర్ లో వచ్చే అవకాశం అయితే ఉంది.

Allu arjun Pushpa 2 movie latest leaks on story and action blocks

మొత్తం 8 యాక్షన్ సీన్స్: ఇక లేటెస్ట్ గా సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన లీక్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో మొత్తం ఎనిమిది యాక్షన్ బ్లాక్స్ ఉండబోతున్నాయట. ముఖ్యంగా ఐదు ఫైట్ సీన్స్ అయితే ఆడియన్స్ కు కిక్ తెప్పించేలా ఉంటాయట. ఇక అందులోనూ ఇంటర్వెల్ క్లైమాక్స్ లో వచ్చే మరో యాక్షన్ బ్లాక్ కూడా హై లెవెల్ లోనే ఉంటుంది అని తెలుస్తోంది. ఫాహాద్ ఫాజల్ అలాగే అల్లు అర్జున్ మధ్యలో వచ్చే ఫైట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ యాక్షన్ బ్లాక్స్ కోసమే భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు.

Allu arjun Pushpa 2 movie latest leaks on story and action blocks

పార్ట్ 3 కోసం సుక్కు స్కెచ్: ఇక సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం కూడా గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ సినిమాకు పార్ట్ 3 ఉండబోతున్నట్లుగా ఇదివరకే ఒక టాక్ వినిపించింది. కానీ ఈ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం సుకుమార్ ఇప్పుడే పుష్ప 3కి సంబంధించిన కొన్ని లీడింగ్ సీన్స్ కూడా సెకండ్ పార్ట్ లో చూపించబోతున్నాడట. అందుకు తగ్గ సీన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే పుష్ప సెకండ్ పార్ట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X