Pushpa 2 లీక్డ్ వీడియో వైరల్.. స్మగ్లింగ్ సీన్స్ తో సుకుమార్ న్యూ ప్లాన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ షూటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబందించిన కీలక సన్నివేశాలని రంపచోడవరం రిజర్వ్ ఫారెస్ట్ లో తెరకెక్కిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఎపిసోడ్స్ ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం ఈ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
పుష్ప 2లో ఇప్పటికే విలన్స్ గా ఇప్పుడు ఎక్కువ మంది అయ్యారు. ఆల్రెడీ సునీల్ విలన్ గా ఉన్నారు. అలాగే పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తోన్న ఫహద్ ఫాజిల్ కూడా నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. పుష్ప2లో అతని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అలాగే మరో విలన్ రోల్ లో జగపతిబాబు కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని సంప్రదిస్తున్నారంట.

ఇక పుష్ప 2 మూవీకి సంబందించిన కొన్ని షూటింగ్ సన్నివేశాలు అప్పుడప్పుడు బయటకొస్తున్నాయి. తాజాగా మరో ఇంటరెస్టింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నదిలో లారీలతో ఎర్రచందనం దుంగలని తీసుకొని వెళ్తోన్న విజువల్స్ ని షూట్ చేస్తున్నారు. వీటిని ఎవరో బ్రిడ్జ్ మీద నిలబడి సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 షూటింగ్ గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ చేస్తూ వీలైనంత వేగంగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే పుష్ప 2 సినిమాని ఈ లీకులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రం కావడం. అది కూడా దేశ వ్యాప్తంగా హైప్ ఉన్న మూవీ కావడంతో పుష్ప2కి సంబందించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకొచ్చిన అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.
వచ్చే ఏడాది సంక్రాంతి లేదా వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో సుకుమార్ ఉన్నారు. ఈ చిత్రాన్ని ఏకంగా 300 కోట్ల బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్స్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడియో రైట్స్ ని టి-సిరీస్ భారీ ధర చెల్లించి కొనుగోలు చేసుకుంది.


Click it and Unblock the Notifications











