Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్‌పై వేటు!
- Lifestyle మీ బాయ్‌ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్‌లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్‌జున్‌వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
పుష్ప 2 కోసం గ్యాప్ సెట్ చేసిన దర్శకుడు.. ఆ సినిమా వచ్చేది ఎప్పుడంటే?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మొదటిసారి తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్పపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈపాటికే సినిమా విడుదలకు సిద్ధం కావాల్సింది. కానీ కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది. సాధారణంగా సుకుమార్ ఏ సినిమా అయినా సరే చాలా ఆలస్యంగా ఫినిష్ చేస్తాడు. కానీ పుష్ప విషయంలో ఆయన కరెక్ట్ ప్లాన్ తోనే షూటింగ్ స్టార్ట్ చేశాడు.
అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అనుకున్న క్రమంలో కరోనా లాక్ డౌన్ అంటూ చాలా నెలల వృధా అయ్యాయి. ఇటీవల సెకండ్ వేవ్ వలన కొంత గ్యాప్ వచ్చింది. మొన్న సుకుమార్ కూడా కొంత అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మొత్తానికి జ్వరం నుంచి కోలుకున్న సుక్కు మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.
పుష్ప 1 ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకి రావచ్చని టాక్ అయితే వస్తోంది. అయితే అది ఎంతవరకు నిజమో తెలియదు గాని రెండవ పార్ట్ డేట్ కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లే అని టాక్ వస్తోంది. ఒక సినిమాకు మరొక సినిమాకు మధ్య ఆరు నెలల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారట. ఒకవేళ పుష్ప 1 ఈ ఏడాది చివరలో వస్తే పుష్ప 2 వచ్చే ఎడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకి రావచ్చని తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.