Allu Arjun పుష్ప బిగ్ లీక్ - మూడో భాగంపై హైప్​ పెంచే సెన్సేషన్​ న్యూస్​​! ఇంతకీ ఏంటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లెక్కల మాస్టర్​ సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప : ది రూల్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప : ది రైజ్‌కు కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ రెండో భాగం చిత్రీకరణ దశలో ఉండగానే పుష్ప 3 కూడా ఉంటుందని రీసెంట్​గా జర్మనీలో జరిగిన 74వ బెర్లిన్‌ చలన చిత్రోత్సవాల్లో అల్లు అర్జున్​ చెప్పారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి బిగ్ ఇంట్రెస్టింగ్ బజ్ బయటకు వచ్చింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. అదేంటో పూర్తి వివరాలు స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీస్​లో పుష్ప : ది రూల్ కూడా ఒకటి. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. మొదటి భాగం పుష్ప: ది రైజ్ ఊహించని విధంగా నార్త్ బాక్సాఫీస్ ముందు గ్రాండ్ హిట్ అందుకోవడంతో ఇప్పుడు అందరి కళ్లు పుష్ప 2 మీదే ఉన్నాయి. దీని కోసం చాలా మంది మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Allu Arjun Pushpa 3 Update This Movie Planning to Release on Summer 2025 Full Details Here

అయితే ఈ రెండో భాగం ఇంకా థియేటర్లలోకి రానే లేదు అప్పుడు గత కొద్ది రోజులుగా పుష్ప పార్ట్ - 3కి సంబంధించిన వార్తలు తెగ రావడం మొదలుపెట్టాయి. రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్​ తెరపైకి హైప్ పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై రీసెంట్​గా అల్లు అర్జున్‌ కూడా మాట్లాడారు. ఓ చలన చిత్రోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.,. పుష్పను మేము ఫ్రాంచైజీగా మార్చాలని ఆలోచిస్తున్నాం. ఈ లైనప్‌ కోసం మా దగ్గర కొన్ని అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి కచ్చితంగా మీరు పుష్ప 3ని ఆశించవచ్చు అని చెప్పి మరింత హైప్​ పెంచేశారు.

దీంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు మూడు భాగం రిలీజ్ డేట్ గురించి వార్త వచ్చేసింది. పుష్ప ది రోర్​ను 2025 సమ్మర్​కు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. మ్యాక్సిమన్​ ఇది కన్ఫామ్ డేటే అని చెబుతున్నారు. ఇప్పుడీ దని గురించే అంతా తెగ చర్చించుకుంటున్నారు.

Allu Arjun Pushpa 3 Update This Movie Planning to Release on Summer 2025 Full Details Here

అయితే రెండో భాగం ఈ ఏడాది ఆగస్ట్ 15న భారీ రేంజ్​లో గ్రాండ్​గా రాబోతుంది. దీన్ని క్రియేటివ్ డైరెక్టర్​ సుక్కు తనకున్న పూర్తి టాలెంట్​ను బయటపెట్టి మరీ దాదాపు రూ.500కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్​తో పోల్చితే రెండో భాగంలో పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటాయని ఇప్పటికే బన్నీ కూడా నొక్కి చెప్పారు. పుష్పరాజ్‌ క్యారెక్టరైజేషన్‌, స్కేల్‌ పరంగా, ప్రజెంటేషన్‌ పరంగా చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుందని అన్నారు. మరి పుష్ప ది రూల్​ ఆశించిన ఫలితాన్ని ఇస్తుందో లేదో. ఇది భారీ హిట్ అందుకుంటేనే మూడు భాగాన్ని తెరకెక్కించే అవకాశం ఉంటుంది. చూడాలి మరి అసలు ఏం జరుగుతుందో..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X