Pushpa 3 ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చెర్రీ మూవీ తర్వాతే పుష్ప 3.. వచ్చేది ఎప్పుడంటే?
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాలే కాకుండా సీక్వెల్ జోరు కూడా నడుస్తోంది. ఒక కథను రెండు మూడు పార్టులుగా చెప్పే ట్రెండ్ గట్టిగానే ఉంది. ఈ ట్రెండ్ ను ముందుగా దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలితో మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో తర్వాత కేజీఎఫ్ కూడా 2 భాగాలుగా వచ్చి మంచి విజయం సాధించింది. అలాగే పొన్నియన్ సెల్వన్, బ్రహ్మాస్త్రం వంటి తదితర సినిమాలు కూడా త్వరలో రెండో పార్టుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ నడుస్తుండగానే దీని మూడో పార్టుపై ఆసక్తికర చర్చ టాలీవుడ్ లో నడుస్తోంది.
అంచనాలకు:తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటిన చిత్రాల్లో 'పుష్ప: ది రైజ్' ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు యావత్ ప్రపంచం ఫిదా అయింది. అందుకే ఇప్పుడు తెరకెక్కిస్తున్న 'పుష్ప: ది రూల్' (Pushpa 2) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగా చిత్రీకరిస్తూ రెడీ అవుతున్నాడు సుకుమార్. ఇప్పటికే టీజర్, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మరింత హైప్ పెంచేశాడు.

భారీ ప్రమోషన్స్:పుష్ప 2 సినిమాలో సీనియర్ హీరో జగపతి బాబు, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, బిగ్ బాస్ దివి వంటి తదితర కీలక పాత్రలు పోషించనుండగా డైరెక్టర్ సుకుమార్ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ ను సైతం భారీగా ప్లాన్ చేశారట. అందుకు దేశవ్యాప్తంగా ప్రతి ముఖ్యమైన నగరాల్లో అల్లు అర్జున్, రష్మిక మందన్నాతో సినిమాను ప్రమోట్ చేయించనున్నారని వార్తలు వస్తున్నాయి.
సుకుమార్ టీమ్ చర్చ:ఇదిలా ఉంటే ఇప్పటికే పుష్ప 2 సినిమాపై హై రేంజ్ అంచనాలు ఉండగా.. ఈ ఫ్రాంచైజీలో మరో సినిమా రానుందని టాక్ వినిపిస్తోంది. పుష్ప సెకండ్ పార్ట్ చిత్రీకరణ మధ్యలో ఉండగానే సుకుమార్ కు మూడో పార్టు చేయాలన్న ఆలోచన వచ్చిందని టాక్ వస్తోంది. కథను ఇంకాస్తా పొడిగించి భవిష్యత్తులో మూడో భాగం తీయాలని సుక్కు టీమ్ లో చర్చ నడుస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని కాస్తా గ్యాప్ తీసుకుని తెరకెక్కించనున్నారట.

చెర్రీ మూవీ తర్వాత:పుష్ప 2 రిలీజ్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ ఓ మూవీ చేయాల్సి ఉందట. ఆ సినిమాకు సంబంధించిన కొన్ని సీక్వెన్స్ ను కూడా ఇప్పటికే షూట్ చేశారని ప్రచారం ఉంది. వచ్చే ఏడాది చెర్రీతో సుక్కు సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉందట. దాని తర్వాత 2025లో లేదంటే 2026లో పుష్ప 3 సినిమాను సుకుమార్ తెరకెక్కించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పుష్ప 2లో హింట్:అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కూడా సుకుమార్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఉంటుందనే టాక్ ఉంది. కానీ ఈ మూవీ క్యాన్సిల్ అయిందనే మరో వార్త చక్కర్లు కొడుతోంది. మొత్తానికి అయితే 'పుష్ప: ది రూల్' తర్వాత పుష్ప 3 (Pushpa 3) కూడా ఉంటుందన్న ప్రచారంతో అల్లు అర్జున్ అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ మూడో పార్ట్ కు సంబంధించిన హింట్ ను పుష్ప 2 ఎండింగ్ లో ఇవ్వనున్నట్లు కూడా మరో వార్త గింగిరాలు తిరుగుతోంది.


Click it and Unblock the Notifications











