‘పుష్ప’పై క్రేజీ న్యూస్.. తొమ్మిది మంది విలన్లతో బన్నీ పోరాటం.. సునీల్‌కు అదిరే ఛాన్స్!!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాపై తాజాగా ఓ రూమర్ తెగ వైరల్ అవుతోంది. ఇన్నాళ్లూ ఈ సినిమాలో విలన్ అతను ఇతను అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అసలు ఈ సినిమాలో మొత్తంగా తొమ్మింది మంది విలన్లను ఉన్నారట. ఈ లెక్కన సుకుమార్ భారీ ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది. ఎవరి పాత్రను ఎలా మలిచాడు..ఎవరితో ఎలా ట్విస్ట్ ఇస్తాడో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ తొమ్మిది మంది విలన్లలో కొందరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారట.

ఆలస్యమైన పుష్ప..

ఆలస్యమైన పుష్ప..

మామూలూగా అయితే పుష్ప సినిమా షూటింగ్ ఈ పాటికే పూర్తి కావాల్సింది. లాక్డౌన్ మొదలు కాకముందే కేరళ అడవుల్లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసేశారు. రెండో షెడ్యూల్‌ కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్న సమయంలోనే కరోనా వైరస్ విజృంభన తీవ్ర స్థాయికి చేరుకుంది. అలా వాయిదా పడ్డ పుష్ప ఈ మధ్యే ప్రారంభమైంది.

మారెడుమిల్లి అడవుల్లో..

మారెడుమిల్లి అడవుల్లో..

పుష్ప సినిమా ఎర్ర చందన స్మిగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దట్టమైన అటవీ ప్రాంతాలున్న ప్రదేశాల్లో పుష్ప షూటింగ్ చేయాలని భావించిన చిత్రయూనిట్.. ఏపీలోని మారెడుమిల్లిని ఎంచుకుంది. అక్కడే సినిమా షూటింగ్‌ను తెరకెక్కిస్తున్నారు.

నిరంతరాయంగా..

నిరంతరాయంగా..

అసలే సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో.. త్వరగా ఫినిష్ చేసేయాలనే ఉద్దేశ్యంతో నిరంతరాయంగా షెడ్యూల్‌ను పూర్తి చేయాలని పుష్ప యూనిట్ భావిస్తోంది. అయితే ఈ సినిమాపై ఓ విషయంలో అందరికీ ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో బన్నీ తలపడేది ఎవరితో.. ఎవరు విలన్‌గా నటించబోతోన్నారు? అన్న విషయాలపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి.

విజయ్ సేతుపతి అనంతరం..

విజయ్ సేతుపతి అనంతరం..

మొదటగా విజయ్ సేతుపతి బన్నీకి విలన్‌గా సెట్ అయ్యాడు. కానీ కరోనా, లాక్డౌన్ వల్ల డేట్ల సమస్య వచ్చింది. దీంతో విజయ్ తప్పుకోవడంతో విలన్ కోసం కష్టాలు పడుతోంది యూనిట్. ఒకసారి ఉత్తరాది నుంచి దింపుతున్నారని, లేదు మళ్లీ కోలీవుడ్ స్టార్ హీరోలను ఫిక్స్ చేశారని వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇందులో భాగంగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

Recommended Video

Allu Arjun Is My Favourite South Star Says Priya Punia
తొమ్మిది మందితో..

తొమ్మిది మందితో..


నిజానికి పుష్ష‌లో 9మంది విల‌న్లున్నార‌ని టాక్‌. అందులో సునీల్‌కీ ఓ పాత్ర ద‌క్కింద‌ట‌. ముఖేష్‌రుషి, రావు ర‌మేష్‌.. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్‌లో చూసిన కొంత‌మంది విల‌న్లు.. పుష్ప విల‌న్ గ్యాంగ్‌లో క‌నిపించ‌నున్నార‌ని, అయితే.. మెయిన్ విల‌న్ ఒక‌డుంటాడ‌ని, ఆయ‌న పేరు ఇంకా ఖ‌రారుచేయ‌లేద‌ని స‌మాచారం. అయితే ఆ మెయిన్ ప్రతినాయకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X