Pushpa రెండో పార్ట్ స్టోరీ లైన్ లీక్: విలన్‌తో పోరాటమే కాదు.. సినిమాలో మరో ఊహించని పాయింట్
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా హీరోగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రెండేళ్ల క్రితం ఇదే సమయంలో 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న అతడు.. గత ఏడాది చివర్లో 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు. అదే సమయంలో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా పోటెత్తడంతో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ రెండో భాగానికి సంబంధించిన స్టోరీ లైన్ తాజాగా బయటకు వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

పుష్పగా రచ్చ చేసిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్ చేశారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.

పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పాన్ ఇండియా వచ్చిన 'పుష్ప' మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా భారీగా కలెక్షన్లను కొల్లగొడుతూ రికార్డులు క్రియేట్ చేసుకుంది.

పుష్పకు వచ్చిన లాభాలు ఎంత
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 25 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 167.24 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 21.24 కోట్ల లాభాలను కూడా ఖాతాలో వేసుకుంది.

పుష్ప ద రూల్ అంటూ రెండోది
'పుష్ప' మూవీ రెండు భాగాలుగా రూపొందిన విషయం తెలిసిందే. మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' అనే టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే, ఇప్పుడు రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ జరుపుకుంటున్నారు. దీనికి 'పుష్ప.. ద రూల్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని కూడా సినిమాలోనే వెల్లడించారు. ఇందులో పుష్ప రూలర్‌గా మారడాన్ని చూపిస్తారట.

పుష్ప రెండో భాగం స్టోరీ లైన్ లీక్
పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన 'పుష్ప' మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో చిత్ర యూనిట్ రెట్టించిన ఉత్సాహంతో రెండో భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే త్వరలోనే చిత్రీకరణను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భాగానికి సంబంధించిన స్టోరీ లైన్ బయటకు వచ్చింది.

మూవీలో అసలు పాయింట్ అదే
'పుష్ప ద రైజ్' దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించడంతో పాటు భారీ సక్సెస్‌ను అందుకుంది. దీంతో రెండో భాగం 'పుష్ప ద రూల్'పై అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో భన్వర్ సింగ్‌తో పుష్పరాజ్ చేసే పోరాటం హైలైట్‌గా ఉంటుందట. వీళ్లిద్దరి మధ్య మైండ్‌గేమ్ ఎలా సాగుతుందనేదే ఇందులో మెయిన్ పాయింట్ అని టాక్.
Recommended Video

మరో మెయిన్ హైలైట్ ఏంటంటే
'పుష్ప ద రూల్'లో విలన్‌తో పోరాటం చేయడం.. సిండికేట్‌లో పుష్పరాజ్ రూలర్‌గా మారడం మాత్రమే ప్రధానంగా చూపించడం కాదని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. రెండో భాగంలో తల్లి సెంటిమెంట్ హైలైట్‌గా ఉంటుందట. తనను కాదన్న అన్నలను పుష్పరాజ్ ఎలా మార్చాడనేది కూడా చూపిస్తారట. ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన ఎపిసోడ్ అనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











