‘పుష్ప’ నుంచి అదిరిపోయే న్యూస్ లీక్: అల్లు అర్జున్‌ మూవీలో మరో హీరోయిన్.. బయటకొచ్చిన స్టోరీ లైన్

అద్భుతమైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీతో మెప్పిస్తూ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను అందుకున్న అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఇక, గత సంవత్సరం 'అల.. వైకుంఠపురములో'తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకుని ఫుల్ జోష్‌ మీదున్నాడు. ఈ క్రమంలోనే 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో మరో హీరోయిన్ కూడా ఉందట. వివరాల్లోకి వెళ్తే....

Recommended Video

Seeti Maar From Radhe Released - Allu Arjun Reacts | Filmibeat Telugu
పుష్ప రాజ్‌గా మారిపోయిన అల్లు అర్జున్

పుష్ప రాజ్‌గా మారిపోయిన అల్లు అర్జున్

'అల.. వైకుంఠపురములో' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం 'పుష్ప'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

‘ఐకాన్ స్టార్'గా మారేందుకు సాహసాలు

‘ఐకాన్ స్టార్'గా మారేందుకు సాహసాలు

గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రాబోతుంది 'పుష్ప' మూవీ. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మారుతున్నాడు. అందుకే దీని కోసం అతడు ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మూవీ కోసమే లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అలాగే, చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడబోతున్నాడు. డీ గ్లామర్‌గా ఉండే ఈ పాత్ర కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పబోతున్నాడు.

‘పుష్ప'పై డౌట్లు.. ఏకంగా ఇద్దరు అంటూ

‘పుష్ప'పై డౌట్లు.. ఏకంగా ఇద్దరు అంటూ

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప'లో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, అదే సినిమాలో మెయిన్ ట్విస్ట్ అని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆ మధ్య వచ్చిన పోస్టర్‌లో బన్నీ కాలికి ఆరు వేళ్లు కనిపించాయి. అయితే, ఇటీవల వచ్చిన రిలీజ్ పోస్టర్‌లో మాత్రం ఐదు వేళ్లే ఉన్నాయి. దీంతో ఇందులో ఇద్దరు హీరోలు ఉన్నారనే టాక్ బాగా వినిపిస్తోంది.

బర్త్‌డే గిఫ్ట్‌కు భారీ స్పందన... రికార్డులు

బర్త్‌డే గిఫ్ట్‌కు భారీ స్పందన... రికార్డులు

అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుని ఏప్రిల్ 7న 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. తద్వారా తెలుగులోనే ఎక్కువ వ్యూస్ సాధించిన ఏకైక టీజర్‌గా ఈ వీడియో నిలిచింది.

‘పుష్ప' నుంచి అదిరిపోయే న్యూస్ లీక్

‘పుష్ప' నుంచి అదిరిపోయే న్యూస్ లీక్

కరోనా నేపథ్యంలో సినిమా షూటింగులు అన్నీ ఆగిపోతుంటే.. 'పుష్ప' చిత్రీకరణ మాత్రం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే విలన్ పాత్రను చేస్తోన్న ఫహద్ ఫాసిల్‌పై కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అలాగే, ఈ షెడ్యూల్‌లో అనసూయ కూడా పాల్గొంటుందని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

అల్లు అర్జున్‌ మూవీలో మరో హీరోయిన్

అల్లు అర్జున్‌ మూవీలో మరో హీరోయిన్

తాజా సమచారం ప్రకారం.. 'పుష్ప' మూవీలో మరో హీరోయిన్‌ కూడా ఉంటుందట. అమె మరెవరో కాదు.. టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్. అవును.. ఇందులో ఆమె అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటిస్తుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. గతంలో ఇదే పాత్రకు నివేదా థామస్‌ను అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈమెను ఎంపిక చేసుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

బయటకు వచ్చిన ‘పుష్ప' మూవీ స్టోరీ

బయటకు వచ్చిన ‘పుష్ప' మూవీ స్టోరీ

'పుష్ప'లో ఐశ్వర్య రాజేష్ చేసే పాత్ర కాసేపే ఉన్నప్పటికీ.. ఎంతో ప్రభావం చూపేదిగా ఉంటుందట. ఆమెను విలన్ అయిన పోలీస్ ఆఫీసర్ హత్య చేయిస్తాడట. దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు హీరో చేసిన ప్రతయత్నమే ఈ మూవీ స్టోరీ లైన్ అని ఓ న్యూస్ లీకైంది. ఇక, ఇందులోనే ఎన్నో ట్విస్టులు ఉంటాయని అంటున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X