twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ కోసం 'పుష్ప'లో మార్పులు.. బన్నీ, సుకుమార్ న్యూ ప్లాన్స్!

    |

    అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం పుష్ప. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బన్నీ మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా కాన్సెప్ట్ కావడంతో అన్ని భాషల్లో సినిమాకు సంబంధించిన గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అయితే సుకుమార్ దృష్టి మొత్తం బాలీవుడ్ పైనే ఉన్నట్లు తెలుస్తోంది.

    ఎలాగైనా మంచి సినిమాతో బాలీవుడ్ లో ఒక హిట్ కొట్టాలని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. డబ్బింగ్ సినిమాలతో ఇప్పటికే బన్నీకి నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. టీవీలలో అలాగే యూ ట్యూబ్ లలో బన్నీ సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో బన్నీ డైరెక్ట్ గా హిందీ బిగ్ స్క్రీన్స్ పై అలరించబోతున్నాడు.

    Allu arjun pushpa team special plans for bollywood

    అందుకోసం నార్త్ జనాలకు నచ్చే విదంగా సినిమా పుష్ప స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కథలో నార్త్ మసాలా ఎలిమెంట్స్ ని కూడా కలపనున్నారట. ఇక మెయిన్ గా బన్నీ తన డ్యాన్స్ స్కిల్స్ తో సినిమాకు సరికొత్త ఎనర్జీని ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట.

    ఇక యాక్షన్ సీన్స్ కూడా నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటాయట. 5 నిమిషాల సీన్ల కోసం 10కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధాంగా ఉన్నారట. మొత్తంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టాలని పుష్ప టీమ్ స్పెషల్ గా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Allu Arjun - Sukumar is the third movie pushpa. The movie is going to be a pan India movie and expectations are huge. The gossip of the movie has gone viral in all languages ​​since it was the first Pan India concept to do the bunny. However, Sukumar's focus seems to be on Bollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X