అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్.. బన్నీ బర్త్ డేకు అదిరిపోయే గిఫ్ట్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 8. గతేడాది ఇదే సమయంలో అంతా రచ్చ రచ్చగా మారింది. అందరూ లాక్డౌన్ అంటూ విసిగెత్తిపోయి ఉన్నారు. సినీ పరిశ్రమ స్థంభించిపోయింది. మరో వైపు అప్డేట్లు లేక అభిమానులు అల్లల్లాడిపోయారు. అలాంటి సమయంలో అల్లు అర్జున్ పుష్ప నుంచి అదిరిపోయే లుక్ బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పుష్ప చిత్రంపై అంచనాలు పెరుగుతూనే వస్తున్నాయి.
Recommended Video

పుష్పపై అలా..
ప్రస్తుతం పుష్పపై అంచనాలు ఎలా ఉన్నాయో సోషల్ మీడియాలో మైత్రీ మూవీ మీద నెటిజన్లు, ఫ్యాన్స్ చేసే కామెంట్లు చూస్తేనే తెలుస్తోంది. పుష్ప అప్డేట్ ఇవ్వడంటూ అభిమానులు నానా రకాలుగా మైత్రిని ఆడుకుంటున్నారు. నెటిజన్ల ట్రోలింగ్‌ను మైత్రీ భరించలేకపోతోంది.

నెటిజన్లపై సెటైర్లు..
పుష్ప అప్డేట్లు అంటూ నెటిజన్లు పెట్టే పోరు భరించలేక మైత్రీ మూవీస్ కొందిరినీ బ్లాక్ చేసి పారేసింది. ఇంకొందరికి వార్నింగ్‌లు ఇచ్చింది. ఇక మొన్న మరోసారి మైత్రీ మీద ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. వారికి కూల్‌గా మైత్రీ కౌంటర్లు ఇచ్చింది.

బన్నీ బర్త్ డే..
బన్నీ బర్త్ డే సందర్భంగా అభిమానులకు మంచి సర్ ప్రైజ్ ఇవ్వాలని మైత్రీ మూవీస్ గ్రాండ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు బర్త్ డే కంటే ఒక్క రోజు ముందుగానే అడ్వాన్స్ విషెస్ చెబుతూ అభిమానుల సమక్షంలోనే ఆ సర్ ప్రైజ్‌ను రివీల్ చేయనున్నారట.

పుష్ప టీజర్..
బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప టీజర్‌ను విడుదల చేయాలని సుకుమార్ ప్లాన్ చేశాడట. ఈ మేరకు రంగం అంతా సిద్దమైనట్టు టాక్. ఇక ఇందులో బన్నీ విశ్వరూపం చూపించి సినిమా మీద అమాంతం అంచనాలుపెంచేయాలని ప్రయత్నిస్తున్నారట. మొత్తానికి బన్నీ ఫ్యాన్స్‌కు మాత్రం ఆరోజు పండుగే అని తెలుస్తోంది.

ప్యాన్ ఇండియా..
బన్నీ మొదటి సారిగా ప్యాన్ ఇండియా సినిమాను చేస్తోన్నాడు. బన్నీకి సౌత్ మొత్తంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాదిన డబ్బింగ్ చిత్రాలతో పరిచయం. ఇక సుక్కు లాజిక్‌లతో పుష్ప చిత్రాన్ని ఉత్తరాదిన కూడా వర్కవుట్ అయ్యేలా చేస్తాడు. పుష్ప చిత్రం ఆగస్టు 13న రాబోతోన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











